Begin typing your search above and press return to search.
పవన్ పై ప్రేమ.. చంద్రబాబు అసమ్మతిని చల్లార్చాడిలా..
By: Tupaki Desk | 31 Jan 2020 7:02 AM GMT2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న భీమవరం మాజీ ఎమ్మెల్యే అంజిబాబును అధినేత చంద్రబాబు దారికి తెచ్చారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అంజిబాబుతోపాటు పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి తో చంద్రబాబు భేటి అయ్యారు.
గతంలో క్రియాశీలకంగా దూకుడు గా ఉన్న అంజిబాబు పార్టీకి పూర్తిగా దూరం కావడంపై.. స్తబ్దుగా ఉండడంపై ఆరాతీశారు. ఎన్నికల్లో ఓటములు సహజమని.. దిగమింగుకోవాలని.. ఎన్నికల్లో పరిణామాలు వదిలేసి రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
సమస్యలపై గంటన్నరసేపు అధినేత తో మనసు విప్పి మాట్లాడిన అంజిబాబు భేటి అనంతరం మెత్తబడ్డారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించడానికి అంగీకరించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో అంజిబాబు భీమవరంలో ఏకంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తో పోటీపడ్డారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లు భీమవరంలో ప్రచారం చేయలేదు. టీడీపీ అభ్యర్థి అంజిబాబును గెలిపించాలని కోరలేదు.. సాయం చేయలేదు. దీంతో అలిగిన అంజిబాబు టీడీపీకి ఫలితాల అనంతరం నుంచి దూరంగా ఉన్నారు. తాజాగా చంద్రబాబు అన్నింటిని విడమర్చి చెప్పి పూర్తిగా స్వేచ్ఛ భీమవరం బాధ్యతలు ఇవ్వడం తో పాటు పూర్తి అండగా నిలుస్తానని హామీ ఇవ్వడం తో అంజిబాబు కూడా మెత్తబడి పార్టీ కోసం పని చేస్తానని చెప్పినట్టు తెలిసింది.