Begin typing your search above and press return to search.
భీష్మాష్టమి.. ఈ పండుగ గురించి తెలుసా? దీని ప్రత్యేకత ఇదే!
By: Tupaki Desk | 20 Feb 2021 7:30 AM GMT‘భీష్ముడు..’ మహాభారతానికి ఆధ్యుడు. భీష్మాచార్యుడు లేకుంటే కౌరవులు లేరు.. పాండవులు లేరు.. చివరకు కురుక్షేత్రం లేదు.. అసలు మహాభారతమే లేదు! అంతటి ముఖ్యుడైన భీష్ముడు కురుక్షేత్ర మహాయుద్ధం మొదలైన తర్వాత పదో రోజున పితృదేవతా నక్షత్రంగా పిలుచుకునే.. అశ్విని నక్షత్రం రోజున పడిపోతాడు.
అయితే.. భీష్ముడికి ఒక వరం ఉంది. ఆయన కోరుకుంటే తప్ప.. మరణం ఆయన్ను చేరలేదు. యుద్ధంలో గాయపడిన భీష్ముడిని నేలపై పడుకోబెట్టడం ఇష్టంలేని అర్జును తన అమ్ముల పొదిలోని శరాలతో అంపశయ్యను నిర్మిస్తాడు. అంటే.. బాణాలతోనే ఒక పడకను ఏర్పాటు చేస్తాడు. ఆ తర్వాత తాత అయిన భీష్మున్ని అంపశయ్యపై పడుకోబెడతారు. అయితే.. దక్షిణాయణం సమయాన పడిపోయిన భీష్ముడు.. ఉత్తరాయణంలో ప్రాణం వదలాలని భావిస్తాడు. ఆ విధంగా.. అప్పటి వరకూ ఎదురు చూసి, ప్రాణాలు విడుస్తాడు.
మాఘ శుద్ధ సప్తమి (రధ సప్తమి లేక సూర్య సప్తమి) నాడు సూర్యుని రధం ఉత్తరం వైపు తిరిగే రోజును ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తారు. ఇవాళ సూర్యుని గతి మారుతుందని అంటారు. మర్నాడే మాఘ శుద్ధ అష్టమి. దీనినే భీష్మాష్టమి అని కూడా అంటారు. భీష్ముడు అంపశయ్య మీద ప్రాణాలు వదిలిన రోజు ఇదే. ఆ విధంగా భీష్ముడు చనిపోయి నేటికి సరిగ్గా 5,056 సంవత్సరాలు అవుతోందట.
మాఘ శుక్ల సప్తమి మొదలు ఏకాదశి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మ పంచకాలుగా భావిస్తారు. కురుక్షేత్రంలో గాయాలపాలై, అంపశయ్యపై పడుకున్న భీష్ముడు.. ఉత్తరాయణం వచ్చే వరకూ వేచి చూస్తాడని చెప్పుకున్నాం. భీష్ముడు అంపశయ్యపై మొత్తం యాభై ఎనిమిది రోజులున్నట్లు భారతంలో ఉంది. ఆ తర్వాత ఆయనలోని పంచ ప్రాణాలను ఒక్కో రోజు ఒక్కొక్కటి చొప్పున వదులుతాడట.
భీష్ముడు చనిపోయిన రోజును భీష్మాష్టమిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఈ రోజు భీష్మునికి తర్పణం విడవాలని స్మృతి కౌస్త్భుం చెబుతోంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి పూజా మందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత గడపకు పసుపు కుంకుమ రాసి, గుమ్మానికి తోరణాలు కట్టి అలంకరించుకోవాలి. అనంతరం తలస్నానము చేసి, తెలుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసముండి, రాత్రి జాగారం చేయాలి. అలా చేయడం పుణ్యం లభిస్తుందని విశ్వాసం.