Begin typing your search above and press return to search.
పతనం నుంచి కాంగ్రెస్ ను ఎవరూ కాపాడలేరా?
By: Tupaki Desk | 5 Aug 2019 2:28 PM GMTఓటు రాజకీయాలకు పెట్టింది పేరుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీని స్వీయ వినాశనం (సెల్ఫ్ డిస్ట్రక్షన్) నుంచి ఎవరూ కాపాడలేరని - పార్టీ తిరోగమనం వెైపు నడుస్తోంది రాజ్యసభలో కాంగ్రెస్ విప్ - అస్సాం ఎంపీ భువనేశ్వర్ కలిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రాజ్యసభ పక్ష నేత గులాం నబీ అజాద్ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తున్న ఆర్టికల్ 370ని వ్యతిరేకిస్తున్నట్లు రాజ్యసభలో ప్రకటిస్తూ నిరసన తెలిపారు. ఈ మేరకు పార్టీ సభ్యులకు విప్ జారీ చేయమని కాంగ్రెస్ విప్ భువనేశ్వర్ కలితకు పార్టీ సూచించింది. దీనికి ఆయన తిరస్కరించారు. విప్ జారీచేయడానికి నిరాకరించారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
’’దేశం కోరుకుంటున్న దాన్ని పార్టీ వ్యతిరేకిస్తోంది. జాతి మూడ్ ఒకలా ఉంది - కాంగ్రెస్ విధానం దానికి విరుద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా నాశనం చేయడానికి అధిష్టానం శాయశ్శక్తులా కృషిచేస్తోంది. దీనిని ఎవరూ ఆపలేరు‘‘ అంటూ కోపంతో ఊగిపోయారు భువనేశ్వర్. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీకి క్లాస్ పీకుతూ రాసిన లేఖ వైరల్ అయ్యింది.
అంతేకాదు - నేను కొనసాగడానికి ఇది సరైన వేదిక కాదు అంటూ తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆయన నిర్ణయంపై అస్సాం ప్రజలే కాకుండా దేశ ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు కూడా ఆయనకే మద్దతు పలకడం విశేషం. పైగా ఇపుడు ప్రజలంతా కాంగ్రెస్ బలంగా లేకపోవడం వల్లే ఇది సాధ్యమైంది - కాంగ్రెస్ బలపడితే కాశ్మీర్ ఎన్నటికీ ఇండియా కాకుండా పోయేది ... మీరు చేసింది రైట్ అంటూ ఆయనకు మద్దతు పలికారు. కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదాలు వరుసగా చేస్తూ నిజంగా పతనం దిశగా పయనిస్తోంది.