Begin typing your search above and press return to search.

మా కుటుంబంలో విభేదాల‌కు కుట్ర : అఖిల ప్రియ‌

By:  Tupaki Desk   |   3 July 2017 3:00 PM GMT
మా కుటుంబంలో విభేదాల‌కు కుట్ర : అఖిల ప్రియ‌
X
పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ కొన్ని ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. కొందరు వ్య‌క్తులు తమ కుటుంబంలో రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. తోబుట్టువుల మ‌ధ్య విభేదాలు తెచ్చే ప్రయత్నాలు చేశారనన్నారు. ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంద‌ర్భంగా అఖిల‌ప్రియ ఈ ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు చేశారు.

నంద్యాల ఉప ఎన్నిక‌లో పోటీ చేస్తానని తన చెల్లెలు మౌనిక చెప్పిందని తెలిపారు. ఆమెకు సర్దిచెప్పి భూమా బ్రహ్మానంద రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపామన్నారు. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణానంత‌రం నంద్యాల ఉప ఎన్నిక చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పోటీలో ఉంటామని వైసీపీ ప్రకటించాక నంద్యాల పోరు ఉత్కంఠభ‌రితంగా మారింది.

టీడీపీ...భూమా కుటుంబానికి టికెట్‌ ఇస్తే శిల్పాకు, అలాకాకుండా శిల్పాకు టికెట్ ఇస్తే భూమా కుటుంబ‌ సభ్యులను నిలబెట్టాలని జగన్ యోచించినట్లుగా ప్రచారం జరిగింది. నంద్యాల ఎన్నిక‌లో టీడీపీకి చెక్ చెప్పాలని ఆయన భావించార‌ని స‌మాచారం. ఈ నేపథ్యంలో భూమా కుటుంబంలో ఒకరికి టిక్కెట్ ఇస్తే.... మరొకరిని తెరపైకి తీసుకు రావాల‌ని వైసీపీ భావించింద‌ని వినికిడి. త‌ద్వారా టీడీపీని ఇబ్బంది పెట్టాలని చూసింద‌ని, అందుకే అఖిలప్రియ అలా మాట్లాడార‌ని చర్చ జ‌రుగుతోంది.

నంద్యాల ఉప ఎన్నికలపై టీడీపీ - వైసీపీలు వ్యూహ రచనలు చేస్తున్నాయి. ఇప్పటికే నేతలు ప్రచారం కూడా చేస్తున్నారు. సోమవారం సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా నేతలతో సమావేశమై, నంద్యాల ఉప ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/