Begin typing your search above and press return to search.
శోభా నాగిరెడ్డి జయంతి రోజు.. భూమా నాగిరెడ్డి మళ్లీ పుట్టారు!
By: Tupaki Desk | 16 Dec 2021 5:03 AM GMTకర్నూలు జిల్లా రాజకీయాలు అనగానే ముందుగా భూమా కుటుంబం పేరే గుర్తుకువస్తోంది. దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలపై ఆ కుటుంబం వేసిన ముద్ర అలాంటిది. కానీ గత కొన్నేళ్లుగా కేసులంటూ, కిడ్నాప్‌లంటూ వివిధ కారణాల వల్ల భూమా కుటుంబంలో ఆందోళన కొనసాగుతోంది.
కానీ ఇప్పుడు మళ్లీ భూమా ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ పండంటి మగబిడ్డకు జన్మనివ్వడమే అందుకు కారణం. ఆమె భర్త భార్గవ రామ్ నాయుడు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
మరోవైపు తన తల్లి దివంగత శోభా నాగిరెడ్డి జయంతి రోజే అఖిల ప్రియ బిడ్డకు జన్మనివ్వడం విశేషం. దీంతో శోభా నాగిరెడ్డి జయంతి రోజు అఖిల కడుపున భూమా నాగిరెడ్డి తిరిగి పుట్టారంటూ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. తన తల్లి మరణంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన అఖిల ప్రియ 2014లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి గెలిచారు.
తన తండ్రి నంద్యాల నుంచి గెలుపొందారు. కానీ అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో మారిన రాజకీయ సమీకరణాలు దృష్ట్యా ఈ తండ్రి కూతురు టీడీపీలో చేరారు. కానీ భూమా నాగిరెడ్డి హఠాన్మరణం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఆ తర్వాత అఖిల ప్రియను చంద్రబాబు తన కేబినేట్‌లోకి తీసుకుని మంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో చిన్న వయసులోనే ఆమె మంత్రి అయ్యారు.
ఆ సమయంలోనే భార్గవ రామ్‌ను పెళ్లి చేసుకున్నారు. కానీ 2019లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఆమె కుటుంబాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. హైదరాబాద్‌లో ఓ భూ వివాదంలో సోదరులను కిడ్నాప్ చేసిన కేసులో అఖిల అరెస్టయ్యారు. ఆ తర్వాత మరో కేసు చుట్టు ముట్టుకోవడంతో భార్గవ రామ్ కొద్దిరోజుల పాటు అజ్ణాతంలోకి వెళ్లిపోచారు.
మరోవైపు కర్నూల్‌లోనూ ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లు కేసు నమోదైంది. ఇలా ఆ కుటుంబాన్ని కేసులు చుట్టుముట్టాయి ఈ నేపథ్యంలో అఖిల ప్రియ బాబుకు జన్మనివ్వడంతో ఆ కుటుంబంలో ఇన్నాళ్లకు తిరిగి సంతోషం నిండినట్లయింది.