Begin typing your search above and press return to search.

భూమా అఖిల కీల‌క నిర్ణ‌యం ఇదేనా?

By:  Tupaki Desk   |   11 May 2018 5:21 AM GMT
భూమా అఖిల కీల‌క నిర్ణ‌యం ఇదేనా?
X
ఊహించ‌ని షాక్ ఒక‌టి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు త‌గ‌ల‌నుందా? అంటే.. అవున‌నే మాట ఏపీ అధికార‌ప‌క్షంలో వినిపిస్తోంది. తేల్చుకోలేక‌పోవ‌టం.. అంచ‌నాలు వేయ‌టంతో వీక్ నెస్.. మిగిలిన రాజ‌కీయాల‌కు భిన్నంగా నంద్యాల రాజ‌కీయం ఉంటుద‌న్న విష‌యాన్ని బాబు మ‌ర్చిపోవ‌టంతో భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వ‌స్తుందా? అన్న‌ది ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.

ఒక‌ప్పుడు భూమా కుటుంబానికి విధేయుడిగా.. స్నేహితుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డికి మంత్రి భూమా అఖిల‌కు మ‌ధ్య న‌డుస్తున్న రాజ‌కీయ వివాదం అంతకంత‌కూ ముదిరిపోతుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు బాబు ఎదుట పంచాయితీ అయిన‌ప్ప‌టికీ ఎలాంటి ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌టం.. ఇరువురి మ‌ధ్య రాజీ కుద‌ర‌ని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే..గ‌తంలో ఇచ్చిన మాట ప్ర‌కారం ఏవీ సుబ్బారెడ్డికి నామినేటెడ్ ప‌ద‌వి ఇచ్చేందుకు బాబు నిర్ణ‌యం తీసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. దీన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు భూమా అఖిల‌.. ఏవీకి ప‌ద‌వి ఇచ్చిన ప‌క్షంలో తాను కీల‌క నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంద‌న్న సందేశాన్ని పార్టీ అధినేత‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకే నేరుగా పంప‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇంత‌కీ.. భూమా అఖిల తీసుకునే కీల‌క నిర్ణ‌యం ఏమిటి? అన్న దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. భూమా వ‌ర్గీయుల‌తో స‌న్నిహితంగా ఉండే వారి స‌మాచారం ప్ర‌కారం.. అఖిల‌ప్రియ త‌న మంత్రి ప‌ద‌విని వ‌దిలేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. అవ‌స‌ర‌మైతే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాల‌ని ఆమె ఉన్న‌ట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌న‌ప్ప‌టికీ.. రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం ప్ర‌కారం భూమా అఖిల పార్టీ మారేందుకు సైతం సిద్దంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఏవీతో రాజీ అన్న‌ది లేద‌ని.. రాజ‌కీయంగా నంద్యాల‌లో తాము మాత్ర‌మే ఉండాలే త‌ప్పించి.. మ‌రెవ‌రూ త‌మ‌కు పోటీగా నిల‌వ‌టాన్ని అఖిల ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు.. బాబు స‌ర్కారుపై ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో.. పార్టీ మారే అంశంపైనా సంప్ర‌దింపులు లోగుట్టుగా సాగుతున్నాయ‌ని తెలుస్తోంది. అయితే.. దీనిపై మ‌రింత క్లారిటీ రావాల్సి ఉంది. త‌న‌కు హ్యాండ్ ఇచ్చి పార్టీ నుంచి వెళ్లిన అఖిల.. ఒక‌వేళ తాను తిరిగి వ‌స్తానంటే జ‌గ‌న్ స్పంద‌న ఎలా ఉంటుంద‌న్న‌ది కూడా ప్ర‌శ్నేన‌ని చెబుతున్నారు. అయితే.. టీడీపీ వ‌ర్గాల్లో సాగుతున్న ఈ ప్ర‌చారంలో వాస్త‌వం ఎంత‌న్న‌ది సందేహంగా మారింది. పార్టీ మారే అంశంపై అఖిల ప్రియ తీవ్రంగా మ‌ధ‌నం చేస్తున్న‌ట్లుగా స‌మాచారం అందులోంది. దీనిపై అఖిల‌ప్రియ కాస్తంత క్లారిటీ ఇస్తే.. అన‌వ‌స‌ర‌మైన క‌న్ఫ్యూజ‌న్ త‌గ్గుతుందేమో?