Begin typing your search above and press return to search.
ఓ అఖిల ప్రియ.. బ్రహ్మానందరెడ్డి.. మధ్యలో ఫిరోజ్!
By: Tupaki Desk | 21 Aug 2022 1:30 PM GMTఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ అప్పుడే ఆయో నియోజకవర్గాల్లో ఎన్నికల వేడి మొదలైపోయింది. ఆయో నియోజకవర్గాల్లో వివిధ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది.
రాయలసీమలో కీలకమైన నంద్యాల జిల్లాలో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులపై పీటముడి నెలకొందని అంటున్నారు. నంద్యాలలో టీడీపీ తరఫున ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుంటమే ఇందుకు కారణమని సమాచారం. 2014 ఎన్నికల్లో నంద్యాల నుంచి వైఎస్సార్సీపీ తరఫున భూమా నాగిరెడ్డి గెలుపొందారు. అయితే ఆయన ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత గుండెపోటుతో మృతి చెందడంతో భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు.
మరోవైపు నంద్యాల పక్క నియోజకవర్గం ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ 2014లో వైఎస్సార్సీపీ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత తన తండ్రి భూమా నాగిరెడ్డితో కలసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ ఫిరాయించిన అఖిల ప్రియ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగానూ వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆళ్లగడ్డలో బరిలోకి దిగిన భూమా అఖిలప్రియ, నంద్యాల నుంచి బరిలోకి దిగిన భూమా బ్రహ్మానందరెడ్డి ఇద్దరూ ఓటమి పాలయ్యారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డకు బదులుగా నంద్యాలపైనా కన్ను వేశారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నంద్యాలలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని తన కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నారని టాక్. ఈ వ్యవహారంపై భూమా అఖిలప్రియ పెద నాన్న కుమారుడు, మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తనయుడు ఫిరోజ్ మండిపడుతున్నట్టు తెలుస్తోంది.
నంద్యాలలో ముస్లింలు, కాపులు, బీసీల ఓట్లు ఎక్కువ. ఈ నేపథ్యంలో కాపు వ్యక్తిని పెళ్లి చేసుకున్న అఖిలప్రియ తాను కాపుల కోడలిని అంటూ చెప్పుకుతిరుగుతున్నారని అంటున్నారు. అయితే అఖిలప్రియకు ఆళ్లగడ్డ ఉండగా.. నంద్యాలను ఆశించడం ఏమిటంటూ ఆమె సోదరుడు బ్రహ్మానందరెడ్డి, ఫిరోజ్ కస్సుమంటున్నారని టాక్ నడుస్తోంది.
ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీ చేసేది.. తాముంటే తామని భూమా బ్రహ్మానందరెడ్డి, ఎన్ఎండీ ఫిరోజ్ చెప్పుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పుడు వీరి మధ్యలోకి అఖిలప్రియ చేరడం నంద్యాల నియోజకవర్గంలో కాకరేపుతోందని అంటున్నారు. మరి ఈ వ్యవహారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా సెటిల్ చేస్తారో వేచి చూడాల్సిందేనని చెబుతున్నారు.