Begin typing your search above and press return to search.
అఖిలమ్మ తిట్లు చంద్రబాబుకూ తగుల్తున్నాయే?
By: Tupaki Desk | 2 Aug 2017 1:47 PM GMTనంద్యాలలో తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ వేసేశారు. ఇక్కడితో ఒక పర్వం ముగిసింది. ఈ సందర్భంగా మొత్తం రక్తి కట్టించేలా వారి నామినేషన్ ప్రక్రియ జరిగింది. భూమా నాగిరెడ్డి సమాధి వద్దకు వెళ్లి.. అక్కడినుంచి బయల్దేరి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డి పిల్లలకు తాను అండగా ఉంటానంటూ బ్రహ్మానందరెడ్డి ఓ ప్రతిజ్ఞ చేశారు. అఖిలప్రియ కూడా తమ చిరకాల రాజకీయ ప్రత్యర్థి మీద ఆరోపణలు గుప్పిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. అయితే శిల్పా మోహన్ రెడ్డి మీద అఖిలప్రియ గుప్పించిన ఆరోపణల్ని మరో కోణంలోంచి గమనిస్తే గనుక.. అవి అచ్చంగా చంద్రబాబు మీద కూడా వేసే నిందల్లాగానే కనిపిస్తున్నాయి. చంద్రబాబు మీద చేస్తున్న ఆరోపణల్లాగానే ధ్వనిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. శిల్పా మోహన్ రెడ్డి తన తండ్రిని చాలా వేధించారని చెప్పిన ఆమె తన తండ్రి మీద అనేక తప్పుడు కేసులు బనాయించారని ప్రధానంగా ఆరోపించారు. ఈ వ్యవహారంలో మొత్తం పాపాన్ని ఆమె ఒక్క శిల్పా మోహన్ రెడ్డికి మాత్రమే ఏ ఉద్దేశంతో అంటగట్టగలిగారో అర్థం కావడం లేదు. ఎందుకంటే శిల్పా మోహన్ రెడ్డి కేవలం తెలుగుదేశం పార్టీ అధినేతల వ్యూహాల్లో ఒక ‘టూల్’ లాంటి వాడు మాత్రమే. ఆ రోజు నాటికి ఆయన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉన్నాడు.
చేతిలో ఉండే కత్తి తో ఎవరైనా ఒకరు పొడవబడి చనిపోతే.. హత్యకేసును ఆ కత్తి మీద పెడతారా, లేదా, కత్తిని పట్టుకున్న వ్యక్తి మీద పెడతారా? అనేది ఇక్కడ కీలకాంశం. ఈ పోలిక ప్రకారం చెప్పాలంటే.. నంద్యాల పరిధిలో భూమా నాగిరెడ్డి మీద ప్రస్తుతం అఖిలప్రియ చెబుతున్న తప్పుడు కేసులు బనాయించేనాటికి , శిల్పా మోహన్ రెడ్డి కేవలం కత్తిలాంటి వాడు.. ఆ కత్తిని పట్టుకున్న వ్యక్తి చంద్రబాబే అని అందరికీ తెలుసు. మరి అఖిలప్రియ ఆవేదన, దూషణలు అన్నీ చంద్రబాబుకు కూడా ఎంతో కొంత అంటుకుంటాయి కదా?
అదే విధంగా.. నంద్యాలకు ఏం చేశారో నిలదీయండి? అని కూడా అఖిలప్రియ ప్రజలకు పిలుపు ఇచ్చారు. అవును మరి ఇదే ప్రశ్న ప్రజలు చంద్రబాబును అడిగితే ఏం సమాధానం వస్తుంది. ఈ ప్రభుత్వం ద్వారా నంద్యాలకు ఏం మంచి జరుగుతున్నా సరే.. అది భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత.. ఎటూ ఎన్నికలు ముంచుకువస్తాయి గనుక తీసుకున్న నిర్ణయాలే తప్ప.. స్వతహాగా ప్భుత్వం నంద్యాల మీద ప్రేమతో చేసినది ఒక్కటి కూడా లేదు. అఖిలప్రియ సంధించిన ఈ విమర్శనాస్త్రం కూడా తెదేపా అధినేత పరువు తీసేలాగానే ఉన్నదని.. రాజకీయ అనుభవం లేని ఈమె .. తమను ఇరుకున పెట్టేలాగా కాకుండా లౌక్యంగా మాట్లాడ్డం నేర్చుకోవాలని తెలుగుదేశం నేతలు అంటున్నారు.
అలాగే శిల్పాను , అఖిలప్రియ అనేక శాపనార్థాలు కూడా పెట్టారు. ఆయన భవిష్యత్తులో రోజూ ఆప్పత్రులకు తిరిగే రోజులొస్తాయని శపించారు. ఈ శాపనార్థాలు కూడా చంద్రబాబుకు తగులుతాయా? ఏమో మరి!!