Begin typing your search above and press return to search.

తండ్రి మరణంతో ఆ విషయం తెలిసిందన్న అఖిల

By:  Tupaki Desk   |   13 March 2017 2:19 PM GMT
తండ్రి మరణంతో ఆ విషయం తెలిసిందన్న అఖిల
X
తల్లి పోయి మూడేళ్లు కూడా నిండని వేళ.. కొండంత అండ లాంటి తండ్రిని పోగొట్టుకోవటం.. ఏ కుటుంబానికైనా..ఏ కుటుంబ సభ్యులకైనా ఇబ్బందే.అందులోకి భూమానాగిరెడ్డి లాంటి ఫ్యామిలీలో అయితే ఆ కష్టాన్ని.. శోకాన్నిమాటల్లో చెప్పలేనిది.అలాంటి వేళ..తన తండ్రికి సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలతో పాటు.. ఆయన మరణంతో తాము కొత్త విషయాన్ని తెలుసుకున్నట్లుగా చెప్పిన అఖిలప్రియా..తమకు విషయం తెలిసేసరికి.. తన తండ్రి అందనంత దూరానికి వెళ్లిపోయిన వైనాన్ని చెబుతూ తన ఆవేదనను తెలియజేశారు భూమానాగిరెడ్డి పెద్ద కుమార్తె..ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ.

ఆదివారం ఉదయం తాను తండ్రితో మాట్లాడి..అహోబిలంలో పని మీద బయటకు వచ్చానని.. కాసేపటికే తండ్రికి ఫిట్స్ వచ్చాయని.. వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నట్లు చెప్పారన్నారు.తాను ఆసుపత్రికి వెళ్లేసరికే..కష్టమని చెప్పారని.. వెంటనే తాను లోకేశ్ కు ఫోన్ చేసి..హెలికాఫ్టర్ సాయం అడిగానని.. అరగంట వ్యవధిలోనే పంపే ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు తనతో మాట్లాడినట్లుగా చెప్పారు. తన తల్లి శోభానాగిరెడ్డి మరణించటానికి ముందు ఇంటి బాధ్యతలతో పాటు.. రాజకీయ..వ్యాపార అంశాల్ని ఆమె చూసుకునే వారని చెప్పారు. తమది పెద్ద కుటుంబమని..వారి బాగోగులు కూడా శోభానాగిరెడ్డే చూసుకునేవారని.. ఆమె మరణంతో నాన్న చాలా డిప్రెస్ అయ్యారని చెప్పారు.

తన తండ్రికి కొన్నేళ్ల కిందట బైపాస్ జరిగిందని.. అది జరిగి చాలా కాలమైందని.. తమకు తెలిసి జ్వరం కూడా వచ్చింది లేదని చెప్పారు. అలాంటి ఆయన ఈ రోజు శాశ్వితంగా తమ నుంచి దూరయ్యారంటే నమ్మలేకపోతున్నట్లుగా అఖిలప్రియ చెప్పారు. తన తల్లి మరణం..తన తండ్రిని విపరీతంగా బాధించిందన్న విషయాన్నితాము గుర్తించేసరికే అంతా అయిపోయిందని.. అమ్మ మరణం తర్వాత తన పనిలో తాను పడినట్లుగా తన తండ్రి కనిపించారని.. కానీ.. ఆయన అలా పడలేదన్న విషయం తమకు ఇప్పుడే అర్థమైందని చెప్పారు.

అమ్మను నాన్న ఎంత మిస్ అయ్యారన్న విషయాన్నిగుర్తించలేకపోయామని.. రాత్రిళ్లు పడుకునే ముందు ఆమె ఫోటోకు దీపం పెట్టటం..ఆల్బమ్స్ చూడటం.. ఆమె వీడియోలు చూడటంలాంటివి చేసే వారని.. అమ్మ లేని లోటు ఆయన గుండెను ఎంతగా బాధించిందో తమకిప్పుడు అర్థమైందని ఆమె చెప్పారు. తాను ప్రాతినిద్యం వహిస్తున్న ఆళ్లగడ్డ.. తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నంద్యాల తన తండ్రికి రెండు కళ్లు అంటే..కళ్లు కాదు గుండె అని చెప్పేవారన్నారు. కళ్లు లేకున్నా బతకొచ్చని కానీ గుండె లేకుండా బతకలేమన్నారు.

తన తండ్రి కల అయిన నంద్యాల రోడ్లను విస్తరణ కార్యక్రమం.. పదివేల మందికి ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని తాను తప్పక నెరవేరుస్తానని.. తన తండ్రి కలను తాను తీసుకున్నానని.. ఆకలను నెరవేర్చే ప్రయత్నం చేస్తానని.. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారాన్నతాము తీసుకుంటామని అఖిలప్రియ చెప్పారు.




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/