Begin typing your search above and press return to search.
అఖిల ప్రియ... ఇప్పుడు నిజంగానే ఒంటరి
By: Tupaki Desk | 6 July 2017 5:30 PM GMTతల్లిని, తండ్రిని కోల్పోయిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆ తరువాత టీడీపీయే తన కుటుంబం అనుకుంది. చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలే తనకు పెద్ద దిక్కు అనుకుంది. అందుకే తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తరువాత అసెంబ్లీలో మాట్లాడుతూ అమ్మానాన్న లేకపోయినా తాను ఒంటరిని కాదని తనకు తాను ధైర్యం చెప్పుకొంది. కానీ... ఇప్పుడు టీడీపీలో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. నాన్న చనిపోయిన తరువాత చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు.. నాన్న మరణంతో ఖాళీ అయిన సీటును తన కుటుంబానికే టిక్కెట్ ఇచ్చారు. దీంతో అంతా తనకు నచ్చినట్లుగానే జరుగుతోందని అఖిలా భావించింది.. నంద్యాల ఉప ఎన్నికల బాధ్యత తనదేనంది, ఎవరూ జోక్యం చేసుకోనవసరం లేదంది. టీడీపీ గెలవకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానంది. కానీ... చంద్రబాబుకి ఇవేమీ నచ్చలేదు.. ఆమెను ఈ ఎన్నికల వ్యవహారం నుంచి పూర్తిగా పక్కన పెట్టారు. వేరేవాళ్లకు బాధ్యతలు అప్పగించారు. సీనియర్ నేతలు అఖిల వైపు చూడడం లేదు, ఆమెను పట్టించుకోవడం లేదు. చంద్రబాబు కూడా పక్కనపెట్టారు. దీంతో అఖిల ఇప్పుడు నిజంగానే ఒంటరిగా మిగిలారు.
నంద్యాల ఉప ఎన్నికల వేళ ఆ నియోజకవర్గంలోని టీడీపీ నేతల మధ్య గ్రూపు తగాదాలు చంద్రబాబుకు చీకాకు పెడుతున్నాయి. సమన్వయం సాధించలేకపోతున్నారన్న కారణంతో మంత్రి భూమా అఖిలప్రియను పక్కనపెట్టారాయన . దీంతో బుధవారం నంద్యాలలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి కూడా ఆమె హాజరుకాలేదు. మంత్రి భూమా అఖిలప్రియ వల్ల నంద్యాల ఎన్నికల్లో ఉపయోగం లేదని భావించిన చంద్రబాబు.. ఆమెను పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికల ఇన్ చార్జ్ బాధ్యతల నుంచి ఆమెను తప్పించి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ కు అప్పగించారు. దీంతో అఖిల వర్గం షాకైపోయింది.
నిజానికి తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన నంద్యాలకు సంబంధించిన ఉప ఎన్నికలకు ఎవరినీ ఇన్ చార్జ్ గా నియమించవద్దని… తానే భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకుని వస్తానని అఖిలప్రియ చంద్రబాబును కోరారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ చేశారు. దీనిపై చంద్రబాబు సీరియస్ అయినట్టు చెబుతున్నారు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా సవాళ్లు చేయడం ఏమిటంటూ ఆయన చీవాట్లు పెట్టారట. పైగా భూమా అఖిలప్రియతో కలిసి పనిచేసేందుకు భూమా ముఖ్యఅనుచరుడు సుబ్బారెడ్డిలాంటి వారు కూడా సుముఖంగా లేకపోవడంతో ఆమెకు ఉప ఎన్నికల బాధ్యతలను అప్పగించలేదని చెబుతున్నారు. కార్యకర్తల సమావేశాన్ని కేఈ ప్రభాకర్, ఏవీ సుబ్బారెడ్డి, ఫరూక్‌లే నిర్వహించారు. మరోవైపు… సీఎం హెచ్చరించి రాజీ చేసినప్పటికీ ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ మధ్య సంబంధాలు మెరుగుపడలేదని చెబుతున్నారు. దీంతో అఖిలకు మద్దతుగా ఎవరూ కనిపించడం లేదు. ఆమెకు సలహాలిచ్చే సీనియర్లెవరూ లేరు. జిల్లా నేతలు, బంధువులే కాదు చంద్రబాబు కూడా ఆమె పట్ల కోపంగా ఉండడంతో అఖిల ఇప్పుడు ఒంటరిగా మారారు.