Begin typing your search above and press return to search.
అఖిలప్రియను గెంటేయడం ఖాయమా?
By: Tupaki Desk | 12 July 2021 5:56 AM GMTరాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిస్తేనే మనుగడ.. కానీ నెగ్గడం కోసం పరిగెడితే.. ప్రత్యర్థులను అణిచివేస్తే.. అహంకారంతో అందరినీ దూరం పెడితే ఏమవుతుంది.. ఇదిగో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అఖిలప్రియలా అవుతుందని విశ్లేషకులు, ఆ జిల్లాలో నేతలు అభిప్రాయపడుతున్నారు.
మాజీ మంత్రి, గత టీడీపీ ప్రభుత్వంలోనే యువ మంత్రి.. తొందరగా అధికారం దక్కడంతో ఆమెకు అడ్డు అదుపూ, అణుకువ లేకుండా పోయింది. దీంతో ఆ దూకుడు రాజకీయాల్లో ఎక్కువైపోయింది. అదే ఇప్పుడు అఖిలప్రియ కెరీర్ ను ప్రమాదంలో పడేసింది. అమ్మా-నాన్న భూమి నాగిరెడ్డి దంపతుల మరణంతో చిన్నవయసులోనే వారి క్రేజ్ తో మంత్రి అయిన అఖిలప్రియ రాజకీయ భవిష్యత్ ఇప్పుడూ ఎటూ కాకుండా పోతోందట..
కర్నూలు జిల్లాలో సీనియర్లను కాదని అఖిలప్రియను మంత్రిని చేశారు చంద్రబాబు. దీంతో ఆమె చిన్నవయసులోనే రాజకీయం తెలియకుండానే వచ్చి అందరిపై ఆధిపత్యం చెలాయిస్తూ.. అందరితోనూ శతృత్వం పెంచుకున్నారు. అయినవారితోనూ గొడవలు పెట్టుకున్నారు. అధికారంలో ఉండగా చెల్లింది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా చెల్లదు కదా.. దీంతో అఖిలప్రియకు కష్టాలు మొదలయ్యాయి.
అఖిల ప్రియ బాధితులంతా ఒక్కటయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆమె వ్యవహారశైలికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. భర్త భార్గవ్ రామ్ బెదిరింపులు.. తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి దూకుడుకు తోడు అఖిల ప్రియ నిర్ణయాలతో ఇప్పుడు ముగ్గురూ బుక్కైపోతున్నారు. ఆ కుటుంబంపై కేసుల పరంపర కొనసాగుతోంది. వీరి దౌర్జన్యాలు, దోపిడీలు, కిడ్నాలు, ఫోర్జరీలు అంటూ చాలా కేసులే నమోదవుతున్నాయి. దగ్గరి బంధువులతోనూ ఆస్తి గొడవలు పెట్టుకోవడంతో వాళ్లుకూడా కేసులు పెట్టేశారు.
ఇక అఖిల ప్రియ వల్ల టీడీపీకే పెద్ద నష్టం వాటిల్లే అవకాశం ఉండడంతో చంద్రబాబు సైతం ఆమెను దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఆమెతో మాట్లాడడం లేదట.. కనీసం టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టడానికి కూడా ఆమెను అనుమతించడం లేదట.. సో టీడీపీ నుంచి అఖిలప్రియను గెంటేసినట్టేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చంద్రబాబు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదట.. దీంతో అఖిల ప్రియ రాజకీయ భవిష్యత్ ముగిసినట్టేనన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.