Begin typing your search above and press return to search.
పాపం..అఖిలప్రియ
By: Tupaki Desk | 11 Oct 2021 5:29 AM GMTమంత్రిగా పనిచేసి జిల్లాలో చక్రం తిప్పిన భూమా అఖిలప్రియ పరిస్థితి చివరకు ఇలాగైపోయింది. తాను టీడీపీని వదిలేస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్నదంతా అబద్ధాలంటు మొత్తుకుంటున్నారు. తొందరలోనే అఖిల టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పార్టీలో భూమా ఫ్యామిలీకి ఎదురవుతున్న అనుభవాల కారణంగానే సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం జరుగుతోందన్నది అందరికీ తెలిసిందే.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీ ఒక వెలుగు వెలిగింది. అలాంటిది 2019 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయినట్లే ఆళ్లగడ్డ, నంద్యాలలో పోటీ చేసిన భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి ఓడిపోయారు. అప్పటినుండి వీరికి అంతా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.
అదే సమయంలో సొంత పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డి హత్యకు మాజీ మంత్రి భర్త భార్గవరామ్ కుట్ర పన్నినట్లు ఒక్కసారిగా ఆరోపణలు వెలుగుచూశాయి. దాంతో ఆయనతో పాటు అఖిల మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి భూమా కుటుంబంపై ఫోర్జరీ కేసులు, భూదందాల కేసులు, దౌర్జన్యాల కేసులు, కరోనా ఫేక్ సర్టిఫికెట్ కేసులు ఒకటేమిటి చాలానే కేసులు నమోదయ్యాయి. చివరకు అఖిలకు జైలు వాసన కూడా తప్పలేదు. బెయిల్ పై అఖిల బయటుంటే భర్త, తమ్ముడు ముందస్తుబెయిల్ పై తిరుగుతున్నారు.
ఇలాంటి వివాదాల కారణంగా చంద్రబాబునాయుడు, లోకేష్ అండ్ కో భూమా కుటుంబాన్ని పూర్తిగా దూరంపెట్టేశారు. వీళ్ళు ఫోన్ చేసినా చంద్రబాబు అండ్ కో మాట్లాడటం లేదు. కనీసం నేరుగా కలవటానికి అపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇక జిల్లాలో అయితే మొదటి నుంచి నేతలంతా భూమా కుటుంబానికి దూరమే. దాంతో పార్టీ ఆఫీసులో కూడా భూమా కుటుంబాన్ని పలకరించే దిక్కులేకపోయింది. పార్టీలో పరిస్ధితులు, కుటుంబపైన పడిన కేసులతో గట్టి మద్దతుదారులు కూడా దూరమైపోయారని సమాచారం.
ఇలాంటి అనేక కారణాల వల్ల పార్టీ లోపలా, బయటా భూమా ఒంటరైపోయారు. అందుకనే తొందరలోనే టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరబోతున్నారంటు ప్రచారం పెరిగిపోయింది. దీన్నీ తాజాగా అఖిల ఖండించారు. తాను టీడీపీలోనే ఉండి పోరాటాలు చేస్తానన్నారు. తాను జనసేనలోకి మారడం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. మరిదే నిజమైతే పార్టీ నేతల్లో చాలామంది తమ కుటుంబాన్ని ఎందుకు దూరంగా పెట్టారో అఖిల చెప్పగలరా ? పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానాలు అందటంలేదన్నది వాస్తవం. ఇలాంటి పరిస్దితుల్లో పార్టీలోనే ఉండి ఏమి పోరాటాలు చేయగలరో అఖిలే చెప్పాలి.