Begin typing your search above and press return to search.
ఎంత తప్పు చేశానో అఖిలప్రియకు అర్థమైందా?
By: Tupaki Desk | 12 July 2019 5:19 AM GMTకర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీకి బాగా పట్టుంది. పొలిటికల్ గా ఎంతో బలమైన ఈ ఫ్యామిలీని లీడ్ చేస్తోంది అఖిలప్రియ. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన భూమా అఖిలప్రియా - నాగిరెడ్డిలు చంద్రబాబు ఆకర్షణకు లోనై టీడీపీలో చేరారు. మంత్రి పదవులు అనుభవించారు. అయితే నాన్న చనిపోయాక కూడా మంత్రిగా కొనసాగారు అఖిలప్రియ.
కానీ ఇప్పుడు ఎటూ కాకుండా పోయారు. అటు రాజకీయం చేసే తండ్రి లేరు. ఇటు టీడీపీ తరుఫున ఓడిపోయారు.. దీంతో భూమా అఖిలప్రియ - ఆమె సోదరుడు బ్రహ్మానందరెడ్డి కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీలోనే ఉంటే భవిష్యత్ లేదని వారు దాదాపు నిర్ణయానికి వచ్చారు. అయితే వైసీపీని వీడి వచ్చిన వీరిని జగన్ తీసుకునే చాన్సే లేదు. అందుకే ఆపార్టీ లోకి వెళదామని ఎంత తాపత్రాయం పడుతున్నా వైసీపీ నుంచి ఈమెను పట్టించుకోవడం లేదట. విజయమ్మ ద్వారా నరుక్కురావడానికి అఖిల ప్రియ ప్రయత్నించినా జగన్ నుంచి స్పందన రావడం లేదట..
ప్రస్తుతం భూమా అఖిల ప్రియకు బద్ద శత్రువులైన గంగుల ఫ్యామిలీ వైసీపీలో చేరింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భూమా అఖిలప్రియ - సోదరుడు బ్రహ్మానందరెడ్డిలను ఓడించి వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇప్పుడు వారు ఉండగా అఖిలప్రియను జగన్ చేర్చుకునే అవకాశమే లేదు. గంగుల ఫ్యామిలీని చేర్చుకునేందుకు వారు అంగీకరించే అవకాశం లేదు.
ఇక టీడీపీని వీడలేక - వైసీపీలో చేరలేక సతమతమవుతున్న అఖిలప్రియకు ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ పెద్దలు రారామ్మని ఆహ్వానిస్తున్నారట.. కానీ బలం లేని బీజేపీలో చేరడానికి అఖిలప్రియ ఆసక్తి చూపడం లేదు. ఇలా టీడీపీ పదవుల ఆశకు చేరిన అఖిల ప్రియ భవిష్యత్ అంధకారంగా మారిపోయిందన్న చర్చ ఆ జిల్లాలో సాగుతోంది.