Begin typing your search above and press return to search.
పవన్ మద్దతు కోసం అఖిల స్పెషల్ రిక్వెస్ట్
By: Tupaki Desk | 2 Aug 2017 4:54 PM GMTనంద్యాల ఉప ఎన్నికల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌కు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ఫోన్ చేసినట్లు సమాచారం. నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఆమె కోరినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం నంద్యాల ఎన్నికల్లో కీలకంగా మారింది.
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం నంద్యాల ఉపఎన్నికపై తమ పార్టీ నిర్ణయాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి అఖిల పవన్‌కళ్యాణ్‌కు ఫోన్ చేసి మద్దతు కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమకు నంద్యాల ఉపఎన్నికలో మద్దతు ఇవ్వాలని చంద్రబాబు సైతం పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేసి ఉంటారని పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. అంతేగాకుండా వ్యక్తిగతంగా అఖిలప్రియను కూడా ఫోన్‌లో పవన్‌కళ్యాణ్‌తో మాట్లాడమని సూచించి ఉంటారని భావిస్తున్నారు. కాగా పవన్‌కళ్యాణ్ మద్దతుపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సమాధానం చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా వెల్లడవుతోంది. కాగా ఈ ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్ తటస్థంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుండగా తమకు మద్దతు ఇస్తారని టిడిపి నేతలు ఆశాభావంతో ఉన్నారు.
ఇదిలాఉండగా... నంద్యాల ఉపఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థిగా ఈ రోజు భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భూమా అఖిలప్రియ మాట్లాడారు. శిల్పామోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్టయ్యిందని మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు. శిల్పా మోహన్ రెడ్డి ప్రచారానికి వస్తే కాలర్ పట్టుకుని నిలదీయాలని ఆమె నంద్యాల నియోజకవర్గ ప్రజలకు పిలుపు నిచ్చారు. నంద్యాలకు ఏం చేశావని ఆయనను నిలదీయాలన్నారు. భూమా నాగిరెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆమె శిల్పా సోదరులపై మండిపడ్డారు.