Begin typing your search above and press return to search.
శిల్పా అలా అనడం కామెడీ అంటున్న అఖిలప్రియ
By: Tupaki Desk | 14 Jun 2017 11:22 AM GMTటీడీపీ సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలగి ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కలవరపాటుకు గురవుతున్న టీడీపీ నేతలు నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు కనిపిస్తోంది. నియోజకవర్గం సమావేశం ఏర్పాటుచేయడమే కాకుండా పార్టీ నేతలు - మంత్రులు ఒకరివెంట ఒకరు శిల్పాపై స్పందించి నంద్యాలలో అంతా ఓకే అనే వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మంత్రి భూమా అఖిలప్రియ అయితే శిల్ప వ్యాఖ్యలను కామెడీతో పోల్చారు.
మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని తాను ఇబ్బంది పెట్టానని అనడం హాస్యాస్పదమని మంత్రి అఖిల ప్రియ అన్నారు. నంద్యాలలో అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు అధికారులపై శిల్పా మోహన్ రెడ్డి ఒత్తిడి తెచ్చారని చెప్పారు. శిల్పా టీడీపీ నుంచి వెళ్తే అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారని తెలిపారు. ఇంత కాలం శిల్పా నంద్యాల అభివృద్ధికి ఉన్న అడ్డు తొలగిపోయిందని ఆమె అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో విజయం తెలుగుదేశం పార్టీదేనని భూమా అఖిలప్రియ ధీమా వ్యక్తం చేశారు.
నంద్యాల నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో పార్టీ నేతల్లో ధైర్యం నింపేలా మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రసంగించారు. నంద్యాలలో ఉప ఎన్నిక ఏకగ్రీవం లేదా ఏకపక్షం కావాలని అన్నారు. మూడేళ్లు టీడీపీలో ఉన్న శిల్పా బయటకు వెళ్లడం వల్ల పార్టీకి నష్టం లేదన్నారు. 30ఏళ్లుగా టీడీపీలో ఉన్న భూమా కుటుంబం, పార్టీ సీనియర్ నేత ఎన్ ఎండీ ఫారూఖ్ - ఎంపీ ఎస్పీవై రెడ్డిలు పార్టీకి అండగా ఉంటారని కాలువ శ్రీనివాసులు అన్నారు. ఎప్పుడు ఉంటుందో లేదో తెలియని వైసీపీలోకి శిల్పా వెళ్లడం అవివేకమన్నారు. భూమా ఆశయం మేరకు నంద్యాలను అభివృద్ది చేస్తామని, టీడీపీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/