Begin typing your search above and press return to search.
జగన్ కు ఆల్ ద బెస్ట్ చెప్పి మనసు దోచుకుంది
By: Tupaki Desk | 28 Feb 2016 9:42 AM GMTచూసేందుకు కాలేజీ అమ్మాయిలా కనిపించే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. రాజకీయం తన రక్తంలోనే ఉందన్న విషయాన్ని తాజాగా తన వ్యాఖ్యలతో నిరూపించింది. తాతల నాటి నుంచి రాజకీయాల్లో నలిగిన కుటుంబం నుంచి వచ్చిన భూమా అఖిల ప్రియా.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శోభానాగిరెడ్డి కుమార్తె అన్న విషయం తెలిసిందే.
తల్లి పోటీ చేసిన స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన అఖిల ప్రియ ఈ మధ్యనే తండ్రితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం ఆమె మీడియాతో పెద్దగా మాట్లాడింది లేదు. తాజాగా.. ఒక ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె.. తాము పార్టీ మారటానికి కారణాల్ని వివరించే ప్రయత్నం చేశారు. పదవుల కన్నా కూడా.. స్థానిక పరిస్థితులు.. కార్యకర్తల ఆకాంక్ష.. అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు చెప్పిన ఆమెను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఒక ఇబ్బందికర ప్రశ్న వేస్తే.. ఆమె తెలివిగా చెప్పిన జవాబు అందరిని ఆకట్టుకునేలా సాగింది.
రాబోయే రోజుల్లో ఏపీకి కాబోయే ముఖ్యమంత్రిని తానేనని తరచూ చెబుతున్న విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీరు ఆల్ ద బెస్ట్ చెబుతారా? అని ప్రశ్నించగా.. తాను తప్పకుండా చెబుతానని చెప్పిన ఆమె జగన్ కు ఆల్ ద బెస్ట్ చెప్పటమే కాదు.. వారికి మంచి జరగాలని చెప్పుకొచ్చారు. అంతాబాగానే ఉంది కానీ.. ఈ తరహా మంచితనం పార్టీకి మంచేనా? అన్న సందేహం టీడీపీ తమ్ముళ్ల నోటి నుంచి రావటం గమనార్హం.