Begin typing your search above and press return to search.

తండ్రి ఆత్మ మీద కూతురు పోరు

By:  Tupaki Desk   |   30 Dec 2017 10:00 AM GMT
తండ్రి ఆత్మ మీద కూతురు పోరు
X
రాజ‌కీయాలు మ‌హా చిత్రంగా ఉంటాయి. కాలం తెచ్చే మార్పుల్ని చూస్తే.. ఆశ్చ‌ర్యానికి గురి కావాల్సిందే. ఒక‌ప్పుడు ఏ వ్య‌క్తికైతే విప‌రీత‌మైన ప్రాధాన్య‌త ఇచ్చి.. వంగి వంగి విన‌యాన్ని ప్ర‌ద‌ర్శించారో.. ఇప్పుడదే వ్య‌క్తి మీద పోరు చేయాల్సి రావ‌టం.. అందుకు సై అంటున్న వైనం చూస్తే.. రాజ‌కీయాలు ఎంత క‌ఠినంగా ఉంటాయో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల‌తో ప‌రిచ‌యం ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి భూమానాగిరెడ్డి కుటుంబానికి.. ఏవీ సుబ్బారెడ్డి ఫ్యామిలీకి మ‌ధ్యనున్న బంధం ఎంత బ‌ల‌మైన‌దో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు.

ఆ మాట‌కు వ‌స్తే.. భూమా నాగిరెడ్డి ఆత్మే ఏవీ సుబ్బారెడ్డి అనే వారు కూడా లేక‌పోలేదు. అలాంటిది త‌ల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అఖిల ప్రియ అండ్ కోల‌కు ఏవీ సుబ్బారెడ్డి పెద్ద‌దిక్కుగా ఉంటార‌ని అంద‌రూ భావించారు. త‌న చిన్న‌త‌నంలో ఏవీ సుబ్బారెడ్డి అంటే ఎంతో విన‌య విధేయత‌ల్ని ప్ర‌ద‌ర్శించిన మంత్రి అఖిల ప్రియ ఇప్పుడు డిష్యూం.. అంటే డిష్యూం అనేస్తున్నారు.

తండ్రి మ‌ర‌ణం ముందు వ‌ర‌కు భూమాకు అత్యంత స‌న్నిహితంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని.. తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత అఖిల ప్రియ పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు. అంతేనా.. నంద్యాల ఉప ఎన్నిక సంద‌ర్భంగా ఏవీ సుబ్బారెడ్డిని ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. అప్ప‌టి నుంచి పెరిగిన దూరం.. ఇప్పుడు అంత‌కంత‌కూ పెరుగుతుందే త‌ప్పించి త‌గ్గ‌ని ప‌రిస్థితి. అదే స‌మ‌యంలో త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆళ్ల‌గ‌డ్డ‌లో ర్యాలీ నిర్వ‌హించాల‌ని భావించిన ఏవీ సుబ్బారెడ్డికి చెక్ చెప్పిన అఖిల‌ప్రియ.. ఆళ్ల‌గ‌డ్డ‌లో ఏవీ నిర్మిస్తున్న కాంప్లెక్స్‌ కు నోటీసులు ఇప్పించ‌టంతో ఇరువురి మ‌ధ్య దూరం మ‌రింత పెరిగింది.

త‌న‌ను వాడుకొని వ‌దిలేశార‌న్న భావ‌న‌లో ఏవీ ఉండ‌గా.. త‌న స్థానాన్ని క‌బ్జా చేయాల‌న్న ప్లాన్ లో ఏవీ ఉన్నార‌న్న భావ‌న‌లో అఖిల‌ప్రియ ఉన్న‌ట్లు చెబుతారు. ఈ నేప‌థ్యంలోనే ఏవీని త‌న ద‌రిదాపుల్లోకి అఖిల‌ప్రియ రానివ్వ‌టం లేద‌న్న మాట వినిపిస్తుంటుంది. ఇదిలాఉంటే.. డిసెంబ‌రు 31 సంద‌ర్భంగా పెద్ద విందుకు ప్లాన్ చేశారు ఏవీ సుబ్బారెడ్డి. ఈ విష‌యం తెలుసుకున్న అఖిల ప్రియ.. త‌న వ‌ర్గాన్ని విందుకు హాజ‌రు కావొద్ద‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

అఖిల‌ప్రియ‌కు చిరాకు తెప్పించాల‌న్న ఉద్దేశంతోనే.. ఏవీ సుబ్బారెడ్డి.. ఆళ్ల‌గ‌డ్డ ఫంక్ష‌న్ హాల్లో ఇయ‌ర్ ఎండింగ్ విందును ఏర్పాటు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. తాను ఏర్పాటు చేసిన విందుకు రావాల‌నిప‌లువురు నేత‌ల్ని ఏవీ సుబ్బారెడ్డి ఆహ్వానిస్తుంటే.. అఖిల‌ప్రియ మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆ విందుకు ఆర్భాటంగా జ‌ర‌గ‌కూడ‌ద‌న్న‌ట్లుగా వ్యూహం ర‌చిస్తోన్న‌ట్లుగా తెలుస్తోంది. విందు సంగ‌తేమో కానీ.. రెండు వ‌ర్గాల మ‌ధ్య పోరు పెరుగుతోంద‌ని.. ఇది లేనిపోని ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణ‌మ‌య్యే ప్ర‌మాదం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఏడాదిని ముగిస్తూ.. కొత్త ఏడాదిని ఆనందంగా స్వాగ‌తం ప‌ల‌కాల్సిన వేళ‌.. అందుకు భిన్నంగా ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య పోటాపోటీ వాతావ‌ర‌ణం నెల‌కొన‌టం మంచిది కాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇరువురి మ‌ధ్య‌నున్న గొడ‌వ పెరిగిన కొద్దీ.. అధికార‌ప‌క్షానికి ఇబ్బందిగా మార‌ట‌మే కాదు.. చెడ్డ‌పేరు తేవ‌టం ఖాయ‌మంటున్నారు. ఇదిలా ఉంటే.. వీరి వివాదాన్ని మంత్రి లోకేశ్ జోక్యం చేసుకొని సెట్ చేస్తే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.