Begin typing your search above and press return to search.
అఖిలప్రియ వార్నింగ్ చంద్రబాబుకేనా?
By: Tupaki Desk | 4 Nov 2018 4:52 PM GMTనియోజకవర్గంలోని తన వ్యతిరేకులకు చంద్రబాబునాయుడు ప్రాదాన్యమిస్తున్నారన్న అంసతృప్తితో రగిలిపోతున్న మంత్రి భూమా అఖిల ప్రియ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు - నేతలను ఉద్దేశించి ఆమె పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. తన తండ్రి భూమా నాగిరెడ్డిని అవమానించినవారి మాడు పగులుతుందని ఆమె హెచ్చరించారు.
చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా ఉన్నప్పటికీ అఖిల చాలాకాలంగా ప్రభుత్వ కార్యక్రమాలలో యాక్టివ్ గా పాల్గొనగడం లేదు. తాజాగా ఆమె కర్నూలు జిల్లా నంద్యాల మండలంలోని తన దత్తత గ్రామం కొత్తపల్లికి వెళ్లారు. అక్కడ తన తండ్రిని గుర్తుచేసుకుంటూ... తన తండ్రి భూమా నాగిరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఆయనను అధికారంపార్టీకి చెందిన వారు అవమానించారని...దాని వెనుక ఎవరున్నారో తనకు తెలుసని అన్నారు. వారి లెక్క తేల్చేవరకు విశ్రమించేది లేదని ఘాటైన హెచ్చరికలు చేశారు. గతంలో భూమానాగిరెడ్డి నంద్యాలకు వచ్చినప్పుడు అధికారులు ఆయనపై కేసులు పెట్టి - ఇబ్బందిపెట్టారని.. అవన్నీ లెక్కేసి బదులు తీరుస్తానని అన్నారు. కొత్తపల్లిలో తమ జెండా ఎగురవేయాలని - ఆ జెండా చూసి ప్రత్యర్థుల మాడులు పగిలిపోవాలని అఖిలప్రియ ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు పిలుపు ఇచ్చారు. తాను కొత్తపల్లికి ప్రతి రోజు వస్తానని ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఎవరైనా ప్రజలను ఇబ్బంది పెట్టాలని - అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే వాళ్ల తాటతీస్తానని మంత్రి అఖిల ప్రియ ఘాటుగా హెచ్చరించారు.
కాగా అఖిల హెచ్చరికలు అధికార పార్టీ నేతలు - అధికారులను ఉద్దేశించినవేనని ఆమె అనుచరులు అంటున్నారు. మరోవైపు అఖిల ప్రియ రాజకీయంగా కొత్త అడుగులు వేస్తున్నారన్న ప్రచారమూ కర్నూలు జిల్లాలో జరుగుతోంది. ఏవీ సుబ్బారెడ్డి అక్కడ టిక్కెట్ సంపాదించడం కోసం చంద్రబాబు నుంచి హామీ పొందారన్న ప్రచారం జరుగుతుండడంతో అఖిల ప్రియ టీడీపీ - చంద్రబాబుపై గుర్రుగా ఉణ్నారని వినిపిస్తోంది. ఆమె జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఎన్నికలు సమీపించే నాటికి ఈ విషయంలో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.