Begin typing your search above and press return to search.
జనసేనలోకి భూమా ఫ్యామిలీ..? నిజమేనా?
By: Tupaki Desk | 24 Oct 2021 11:30 PM GMTకర్నూలు జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డి, శోభా కుటుంబం.. రాజకీయాల్లో 40 ఏళ్ల నుంచి ఉన్నారు. అయి తే.. గత చంద్రబాబు హయాంలో నాగిరెడ్డి.. ఎన్నికల సమయంలో శోభ మృతి చెందడంతో వారి కుమార్తె భూ మా అఖిల ప్రియ రాజకీయ అరంగేట్రం చేశారు. దూకుడగా.. ఫైర్ బ్రాండ్‌గా కూడా అఖిల ప్రియ గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. చంద్రబాబు దగ్గర అత్యంత స్వల్ప కాలంలోనే మార్కులు సంపాయించుకు న్నారు. ఈ నేపథ్యంలో నే మంత్రి అయ్యారు. అయితే.. గత రెండున్నరేళ్ల నుంచి భూమా అఖిల ప్రియకు టీడీపీ నుంచి మద్దతు లభించడం లేదనే వాదన ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
ఎందుకంటే.. గత ఏడాది నుంచి భూమా అఖిల ప్రియ కుటుంబం ఇబ్బందుల్లోనూ.. కోర్టు కేసుల్లోనూ ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని ఆమె ఆవేదనగా కనిపిస్తోంది. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ తనకు.. నంద్యాల నియోజకవర్గం తన సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డికి కేటాయించా లని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అయితే.. దీనిపైనా చంద్రబాబు నుంచి క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలోనే అఖిల ప్రియ.. పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం ఉంది. దీంతో ఈ విషయం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.
మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి భూమా కుటుంబానికి మధ్య మొదట్నుంచి రాజకీయంగా సన్నిహిత సంబంధాలున్నాయి. దివంగత నేతలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా శోభానాగిరెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో భూమా దంపతులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే నాగిరెడ్డి నంద్యాల నుంచి, అఖిల ప్రియ.. ఆళ్లగడ్డ నుంచి విజయం సాధించారు. తర్వాత మంత్రి పీఠంపై ఆశలతో చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో భూమా అఖిలప్రియ మంత్రిగా కూడా పనిచేశారు.
కాగా, చిరంజీవి సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కూడా భూమా కుటుంబం సన్నిహిత సంబంధాలే కొనసాగిస్తోంది. ఇక ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో జనసేనలో చేరితో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయని భూమా కుటుంబం భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ భూమా అఖిలప్రియ జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ విస్తృత ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భూమా అఖిలప్రియ గర్భవతిగా ఉండటంతో ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి రాజకీయంలో యాక్టివ్‌గా ఉంటున్నారు. కాగా, జనసేన పార్టీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై తాజాగా భూమా అఖిలప్రియ స్పందించారు. తాము టీడీపీలోనే ఉంటామన్నారు. అయితే.. దీనిని ఎవరూ విశ్వసించకపోవడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా..రాజకీయాల్లో మార్పులు.. జంపులు సహజం కదా!!