Begin typing your search above and press return to search.
దైవ దర్శనంపై దుష్ర్పచారమా!
By: Tupaki Desk | 4 Nov 2017 2:01 PM GMTవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తిరుమల వెంకన్న దర్శనంపై జరుగుతున్న ప్రచారాన్ని వైఎసార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. హిందూ ధార్మికత వెలుగొందాలని, ప్రజలకు మేలు జరగాలని వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోసం వైయస్ జగన్ తిరుమలకు వస్తే ఆ దర్శనం మీద కూడ టీడీపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని, ఇలాంటి పరమ నికృష్ట ఆలోచన చేసిన చంద్రబాబు పార్టీకి దేవుడు తగిన శాస్తి చేస్తాడని ఆక్షేపించారు. జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు వేంకటేశ్వరుడిని కూడ పావుగా వాడుకునేందుకు బాబు పార్టీ ప్రయత్నించడం దారుణమన్నారు. కచ్చితంగా టీడీపీకి పాపం తగులుతుందని హెచ్చరించారు.
తిరుపతిలో భూమన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలన్న తలంపుతో వైఎస్ జగన్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని ఆశీర్వాదం పొందారని, అయితే...దైవ దర్శనాన్ని తట్టుకోలేక కొన్ని ఏడుపుగొట్టు ఛానళ్లు అక్కసు వెళ్లగక్కుతున్నాని మండిపడ్డారు.చంద్రబాబుపై ఉన్న ప్రభు భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తూ పచ్చ రోగులు వైయస్ జగన్ ను ప్రజల్లో పలుచన చేయాలని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పై పాపం మోపే ప్రయత్నం చేస్తే హిందువులంతా పచ్చబాబుల తీరును ప్రశ్నించడం ఖాయమన్నారు. ఈ ప్రభుత్వం భగంవుతిడి దగ్గరకు ఎవరూ రావొద్దన్న నీచమైన ఆలోచన చేస్తోందని భూమన ఫైర్ అయ్యారు.
గతంలో దివంగత సీఎం వైఎస్ఆర్‌పై సైతం ఇలాంటి దుష్ప్రచారం చేశారని భూమన గుర్తు చేశారు. భగవంతుని పట్ల తనకున్న అనన్యభక్తి విశ్వాసాలను వైఎస్ఆర్ చాటుకున్నారని, ఏరోజు కూడ డిక్లరేషన్ సంతకం పెట్టకుండానే దర్శనం చేసుకున్నారని గుర్తు చేశారు. అందుకు ప్రత్యక్షసాక్షిని తానేనని చెప్పారు. కానీ పచ్చకామెర్ల పార్టీ, ఛానళ్లు వైఎస్ఆర్ పై ఏడుకొండలను రెండు కొండలు చేశాడంటూ ప్రజల్లో చొప్పించేందుకు ఓ విష ప్రచారం చేశాయన్నారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడే ధర్మప్రచార పరిషత్ ను హిందూ ధర్మప్రచార పరిషత్ గా మార్చారన్నారు. వెంకటేశ్వర భక్తి ఛానల్ ను స్థాపించింది కూడ వైఎస్ఆర్ అన్న సంగతి పచ్చపార్టీ నేతలు గుర్తు చేసుకోవాలని భూమన చురక అంటించారు. వేద విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడంతో పాటు కొండమీదున్న కార్మికులను తన హయాంలో పర్మినెంట్ ఉద్యోగులుగా చేసిన ఘనత వైఎస్ఆర్ దేనన్నారు. వేదం చదివే ప్రతి విద్యార్థికి వైఎస్ఆర్ 2 లక్షల స్టైఫండ్ ఏర్పాటు చేశాడని భూమన గుర్తు చేశారు. దేవాలయాలకు దూపదీప నైవేద్యాలు నిరాటంకంగా జరగాలని ఆలోచన చేసిందే వైఎస్ఆరేనని భూమన అన్నారు. అర్చక సంఘాలకు వైఎస్ఆర్ ఎనలేని మేలు చేశారని, హిందూ ధర్మాన్ని రక్షించేందుకు వైఎస్ఆర్ నడుబిగించారని ఆనాడు ధర్మకర్తలు చెప్పిన విషయాన్ని భూమన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కానీ చంద్రబాబు ప్రస్తుత పాలన అందుకు భిన్నంగా సాగుతున్నదని భూమన గుర్తు చేశారు. విజయవాడలో 40 గుళ్లు కూలగొట్టిన చరిత్ర చంద్రబాబుదని భూమన మండిపడ్డారు. అమరేశ్వరుని ఆలయ భూముల్ని అప్పనంగా ధారదత్తం చేసిన ఇలాంటి వ్యక్తి హిందువునంటే సభ్యసమాజం నవ్వుతుందన్నారు. బాబు పాలనలో మొత్తం కొండమీద అవినీతి జరుగుతుందని పత్రికలు కోడై కూస్తున్నాయన్నారు. బాబు ఎక్కడ హారతిచ్చినా, కొబ్బరికాయ కొట్టినా చెప్పులు కూడ విప్పడని...ఆయన్ను కాపు కాసేందుకు మాత్రం పచ్చఛానళ్లు ఆరాటపడతాయని భూమన విమర్శించారు. జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు వేంకటేశ్వరుడిని కూడ పచ్చరోగులు పావుగా వాడుకోవడం దారుణమన్నారు. వైఎస్ జగన్ ను ఆలయానికి దూరం చేసే ప్రయత్నంలో భాగంగా పచ్చరోగులు ఎదురుదాడి చేస్తున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత భక్తివిశ్వాసాలతో వైఎస్ జగన్ తిరుమలకు వస్తే.... ఎవరో అమ్మాయి చెప్పులేసుకుపోయిందని, దాన్ని చూపించి జగన్ తో పాటు ఆవిడ వెళ్లిందని పచ్చకామెర్ల మీడియా ప్రచారం చేయడం ఘోరమన్నారు. ఇలాంటి కుట్రలను ఎదుర్కుంటామని స్పష్టం చేశారు.