Begin typing your search above and press return to search.
సంచలనం.. రాజకీయాల్లోకి మౌనిక!
By: Tupaki Desk | 6 March 2023 6:57 PM GMTఎట్టకేలకు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనికా రెడ్డి, ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకున్న తర్వాత కర్నూలు వెళ్లి తమ పెద్దల ఆశీస్సులు తీసుకుంది.. ఈ జంట. అక్కడ నుంచి ఈ దంపతులు తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మౌనికకు, తనకు ప్రజా సేవ అంటే ఆసక్తి ఉందని మంచు మనోజ్ తెలిపారు. ఆ అంశమే తమను కలిపిందన్నారు. తమ మధ్య 12 ఏళ్లుగా పరిచయం ఉందన్నారు. నాలుగేళ్ల క్రితం నుంచి తాము ప్రేమించుకుంటున్నామని తెలిపారు. నాలుగేళ్ల ప్రేమ ఫలించినందుకు సంతోషంగా ఉందన్నారు. తాను మళ్లీ సినిమాలు చేయబోతున్నట్టు తెలిపారు. అందరి ఆశీస్సులు, అభిమానంతో ఈ ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నానన్నారు.
జీవితంలో ఏ విషయంలోనైనా ఓడిపోవచ్చు కానీ, ప్రేమలో గెలవాలని మనోజ్ వ్యాఖ్యానించారు. ఇది తాను ఎప్పుడూ నమ్మే సూత్రమన్నారు. ఎందుకంటే ఇప్పుడు తన విషయంలో ప్రేమే గెలిచిందని గుర్తు చేశారు. నాలుగేళ్ల క్రితం తాను వేరే లోకంలో ఉన్నప్పుడు మౌనిక తనకు మద్దతుగా నిలబడిందని చెప్పారు. అలా, మేమిద్దరం మరింత దగ్గరయ్యామని తెలిపారు. ఎన్నో వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ ధైర్యంగా నిలబడ్డామని వెల్లడించారు. దేవుడి దయ వల్ల అందరూ కలిసి తమ పెళ్లి చేశారన్నారు. దైరవ్ (మౌనికా రెడ్డి మొదటి భర్త వల్ల కలిగిన కుమారుడు) తన జీవితంలోకి రావడం కూడా శివుడి ఆజ్ఞగా భావిస్తానని తెలిపారు.
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం తమిద్దరికీ ఉందన్నారు. తమ ఇద్దరి అభిప్రాయాలు ఒక్కటేనన్నారు. అయితే, తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని తెలిపారు. మౌనికకు రాజకీయాలపైన ఆసక్తి ఉంటే తాను సపోర్ట్‌గా నిలబడతానని వెల్లడించారు.
కాగా మౌనికా రెడ్డి ఇప్పటివరకు తన అక్క భూమా అఖిల ప్రియ తరఫున నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ప్రచారం చేయడం, బహిరంగ సభల్లో మాట్లాడటం చేశారు. మీడియాకు సైతం పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో భూమా అఖిలప్రియకు టీడీపీ సీటు ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. ఇప్పటికే అఖిల అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా భూమా మౌనిక టీడీపీ సీటు తనకు ఇవ్వాలని కోరే అవకాశం ఉందని అంటున్నారు.
ఒకవేళ ఆళ్లగడ్డ సీటు తన అక్క భూమా అఖిలప్రియకు టీడీపీ కేటాయిస్తే మౌనికా రెడ్డి నంద్యాల నుంచి అసెంబ్లీకి పోటీ చేసే చాన్సు ఉందని చెబుతున్నారు. గతంలో ఇలాగే మౌనిక తల్లిదండ్రులు నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి నంద్యాల, ఆళ్లగడ్డల నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2014లోనూ భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. నాగిరెడ్డి కన్నుమూశాక ఆయన అన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మౌనిక కూడా తన తల్లిదండ్రులు, అక్క బాటలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.