Begin typing your search above and press return to search.
భూమా నాగిరెడ్డికి అవమానం?
By: Tupaki Desk | 6 Nov 2016 10:02 AM GMTభూమా నాగిరెడ్డి అంటే రాయలసీమలో తిరుగులేని నేత.. ఏ పార్టీలో ఉన్నా ఆయన టైగర్లా బతికారు... అయితే... కొద్దినెలల కిందట వైసీపీ నుంచి గెలిచి మళ్లీ టీడీపీలోకి ఫిరాయించిన తరువాతే ఆయన వేల్యూ దారుణంగా పడిపోయిందని చెబుతున్నారు. టీడీపీలో చంద్రబాబు కాదు కదా... కర్నూలులోని నేతలు కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదంటున్నారు. తాజాగా కర్నూలులో జరిగిన చంద్రబాబు జన చైతన్య సభలో జరిగిన ఘటన అందుకు ఉదాహరణగా నిలిచింది. చంద్రబాబు నిర్వహించిన సభావేదికపై భూమా నాగిరెడ్డి - ఆయన కుమార్తె అఖిల ప్రియలకు చోటు దొరకలేదు. అంతేకాదు... చోటామోటా ఎమ్మెల్యేలు కూడా ఠీవిగా కూర్చుంటే నాగిరెడ్డి ఓ మూలన నుంచోవాల్సి వచ్చింది. చివరకు మంత్రి అచ్చెన్నాయుడు భూమాను చూసి వెంటనే ఆయనకు సీట్లు ఏర్పాటు చేయడంతో పాపం గౌరవం దక్కింది.
సీనియర్ నేత అయినప్పటికీ వేదికపై భూమా నాగిరెడ్డికి సీటు దొరకలేదు. కూతురితో కలిసి దాదాపు అరగంట పాటు వేదికపైనే ఒక వైపు నిలబడ్డారు. ఎవరైనా సీట్లు ఖాళీ చేస్తారేమోనని చాలా సేపు తండ్రికూతురు ఎదురుచూశారు. అయితే ఎవరూ కూడా తమ స్థానాలను ఖాళీ చేయలేదు. దీంతో భూమా చాలా ఇబ్బంది పడ్డారు. చివరకు వేదికపై అలా నిలబడి ఉండడం ఇష్టం లేక వేదికపై నుంచి దిగిపోయారు. అయితే ఈ విషయాన్ని జిల్లా ఇన్ చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు చూసి వెంటనే వారి వద్దకు వెళ్లారు. తిరిగి పిలుచుకొచ్చి వేదికపై కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ - కర్నూలు పార్లమెంట్ ఇన్ చార్జ్ బీటీ నాయుడు సీట్లను ఖాళీ చేయించి భూమా నాగిరెడ్డి - అఖిలప్రియలను కూర్చోబెట్టారు.
భూమా ఒకప్పుడు ఎలా ఉండేవారో తెలిసిన నేత కావడం.. ఆ జిల్లాకు ఇంఛార్జి మంత్రిగా ఉండడంతో అచ్చెన్న జోక్యం చేసుకుని భూమా పరువు కాపాడినట్లయింది. కర్నూలు జిల్లాకు చెందిన ఏ టీడీపీ నేత కూడా భూమాకు జరిగిన అవమానాన్ని పట్టించుకోలేదు. అంతేకాదు.. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా వేదికపైనే ఉన్నా భూమాను చూసీచూడనట్లు వదిలేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/