Begin typing your search above and press return to search.
షాకింగ్: భూమా నాగిరెడ్డి ఇక లేరు
By: Tupaki Desk | 12 March 2017 6:53 AM GMTతెలుగుదేశం పార్టీ సీనియర్ నేత.. కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి ఇకలేరు. అయినవాళ్లకు అంతులేని శోకాన్నిమిగిల్చిన ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం తీవ్రమైన ఛాతినొప్పితో కుప్పకూలిన ఆయన్ను వెంటనే ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు. భూమా ఆరోగ్యం మరింత విషమంగా ఉండటంతో ఆయన్ను హుటాహుటిన నంద్యాలకు తరలించారు. ఆయన్నుకాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
భూమాకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిన వెంటనే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. అవసరమైనపక్షంలో ఆయన్ను హైదరాబాద్ కు తరలించేందుకు హెలికాఫ్టర్ ను సిద్ధం చేయించారు. మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యుల బృందాన్నితరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.
మాస్ లీడర్ గా..కర్నూలు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన భూమా ఇప్పటికి బలమైన ప్రజాదరణ ఉన్న రాజకీయ కుటుంబంగా చెప్పొచ్చు. 1964 జనవరి 8న జన్మించిన ఆయన..తన సోదరుడి మరణం నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నాగిరెడ్డి సోదరుడు భూమా శేఖర్ రెడ్డి ఆకస్మికంగా మరణించటం.. నాడు జరిగిన ఉపఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 1996లో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న సమయంలో నంద్యాల లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రధాని పీవీ నరసింహరావుపై పోటీ చేసేందుకు భూమానాగిరెడ్డిని ఎంపిక చేయటంతో ఆయన పేరు అప్పట్లో మారుమోగటమే కాదు..ఫేమస్ అయ్యారు.
మూడుసార్లు ఎంపీగా వ్యవహరించిన ఆయన ఎక్కువకాలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లిన భూమా.. ఆ తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్ లోకి విలీనంఅయ్యే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ కుసన్నిహితంగా ఉన్న ఆయన.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఎన్నికల ప్రచారం జరుగుతున్న వేళలో.. జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో ఆయన సతీమణి భూమా శోభానాగిరెడ్డి మరణించారు. ప్రేమించి పెళ్లాడిన శోభానాగిరెడ్డి మరణం భూమాను తీవ్రంగా కలిచివేసిందని చెబుతారు. భార్య మరణం నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల్లో కుమార్తె అఖిలప్రియను నిలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతరఫున ఉప ఎన్నికల బరిలో నిలిచిన ఆమె.. భారీ మెజార్టీతో విజయం సాధించారు.
అనంతరం.. కొద్దికాలం జగన్ పార్టీలో కొనసాగినా..తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఆయన తన కుమార్తెతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో.. మంత్రి పదవిలభించే అవకాశం ఉందన్నవాదనలు వినిపిస్తున్నంతలో..ఊహించనిపరిణామం చోటు చేసుకోవటం గమనార్హం.
భూమాకు మాస్ లీడర్ గా మాంచి పేరుంది. కర్నూలు జిల్లా మొత్తాన్ని కాకున్నా.. నంద్యాల లోక్ సభ పరిధిలోని ప్రాంతాలపై విపరీతమైన పట్టున్న భూమా నాగిరెడ్డి.. ఫ్యాక్షన్ నేతగా ముద్ర ఉంది. ఆయనపై వివాదాలు చాలానే ఉన్నాయి. ఆయన నిజ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలతోనూ.. రాజకీయాల్లో ఆయన అనుసరించే విధానాలు..పలు తెలుగు.. తమిళ సినిమాలకు ముడిసరుకుగా ఉపయోగపడిందని చెప్పకతప్పదు.
భూమాకు వివాదాలకు చాలా దగ్గర సంబంధమే ఉంది. ఫ్యాక్షన్ పేరిట పలువురి ప్రాణాలు పోయేందుకు ఆయన కారణమయ్యారన్న విమర్శ ఉంది. అయితే.. తానేం చేసినా.. తమను నమ్మకున్న వారి కోసం.. వారి క్షేమం కోసం కొన్ని పనులు చేయక తప్పదని చెబుతుంటారు. మీడియాతో పెద్దగా మాట్లాడేందుకు ఇష్టపడని ఆయన.. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన వారిపై ఫైర్ అవుతారన్న ఆరోపణ ఉంది.
ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఆయన మరణం.. ఏపీ అధికార పక్షానికి భారీ లోటుగా చెప్పొచ్చు. భూమా మరణంతో కర్నూలు రాజకీయాల్లో ఓ తరహా రాజకీయ నేత నిష్క్రమించినట్లుగా చెప్పక తప్పదు. ఏది ఏమైనా.. తనను నమ్మకున్న వారికి అపన్నహస్తం అందిస్తూ.. వారి కోసం ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే సినిమాటిక్ మాస్ రాజకీయ నేత లేని లోటు ఆయన్ను అభిమానిస్తూ.. ఆరాధిస్తూ.. ఆయన్నే దైవంగా నమ్ముకున్న వారికితాజా పరిణామం శరాఘాతం లాంటిదని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/