Begin typing your search above and press return to search.
భూమా రాజకీయ సన్యాసం తీసుకుంటాడట !
By: Tupaki Desk | 4 Oct 2016 8:58 AM GMTవైసీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరిన సీనియర్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తన అసంతృప్తిని ఘాటుగా వ్యక్తం చేశారు. తను ప్రాతినిథ్యం వహిస్తున్న నంద్యాలలో పనుల తీరును ప్రస్తావిస్తూ ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. భూమా ఎమ్మెల్యేగా ఉన్న నంద్యాలలో తీవ్ర సమస్యగా ఉన్న రహదారుల విస్తరణ జాప్యంపై పట్టణవాసులు కన్నెర్రజేశారు. గాంధీ జయంతి రోజునే పట్టణంలోని గాంధీ విగ్రహ కూడలి వద్ద రహదారుల విస్తరణ పోరాట సమితి ఆధ్వర్యంలో రోడ్లను విస్తరించాలని కోరుతూ వందలాది మంది ప్రజలు - వివిధ సంఘాల నాయకులు - మహిళలు - విద్యాసంస్థల ప్రతినిధులు ఈ సామూహిక నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న సంఘటనలతో భూమా గుడ్ బై స్టేట్ మెంట్ ఇచ్చారు.
పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. రహదారి విస్తరణ లేక ప్రతి ఏడాది ఎందరో అమాయకుల ప్రాణాలు ప్రమాదాల వల్ల బలవుతున్నాయని అన్నారు. రహదారుల విస్తరణపై వారి అభిప్రాయాలను తెలియజేయాలని ఎంపీ ఎస్పీవై రెడ్డి - ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి - పురపాలక అధ్యక్షురాలు దేశం సులోచనను వేదికపైకి ఆహ్వానించగా వారు రాకపోవడం బాధాకరమన్నారు. దీనిపై ముగ్గురు ప్రజాప్రతినిధులు ఒక్కతాటిపైకొచ్చి వారి అభిప్రాయాలను తెలపాలని కోరినప్పటికీ వారు హాజరు కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో రహదారులు విస్తరించినా నంద్యాలలో వాయిదా వేయడంపై రాజకీయ నాయకుల విభేదాలు - నిర్లక్ష్యం కారణమని మండిపడ్డారు.
ఈ ఆందోళన అనంతరం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో భూమా నాగిరెడ్డి మాట్లాడారు. పట్టణంలో రహదారుల విస్తరణ పూర్తి చేయకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. రహదారుల విస్తరణ కోసం ఎవరూ రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్ నుంచి కార్యాలయాలు విజయవాడకు తరలించడం వల్ల కార్యాలయాల్లో పనులు జరగడం ఆలస్యమైందన్నారు. అంతే తప్పా తాను రహదారుల విస్తరణ పనుల్లో రాజీపడే ప్రశ్నే లేదన్నారు. కల్సనా సెంటర్ నుంచి సాయిబాబానగర్ వరకు రూ.36 కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ మేరకు అంచనాలు తయారు చేసి పంపాలని ఇంజినీర్లకు ఆదేశాలు వచ్చాయన్నారు. కింది స్థాయిలో ఉండే డీఈఈలు అంచనాలు తయారు చేసి ముఖ్య ఇంజినీరు ఎండీకి పంపారన్నారు. త్వరలోనే పనులు పూర్తవుతాయని భరోసా ఇచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/