Begin typing your search above and press return to search.
భూమాకు స్వల్పంగా గుండెనొప్పి
By: Tupaki Desk | 4 July 2016 4:38 AM GMTఏపీ తెలుగుదేశం పార్టీ నేత.. కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారు. ఆదివారం రాత్రి ఆయనకు స్వల్పంగా గుండె నొప్పి వచ్చింది. క్రాంతినగర్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన భూమా.. అభిమానులు కాల్చిన బాణసంచా పొగను పీల్చటంతో కొద్దిపాటి ఇబ్బందికి గురయ్యారు. విందు అనంతరం ఇంటికి వెళ్లిన ఆయన.. శ్వాస పీల్చుకోవటానికి అసౌకర్యానికి గురయ్యారు.
దీంతో.. వైద్యుల్నిసంప్రదించగా.. ఆయనకు ఈసీజీ తీసి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. దాదాపు గంట పాటు భూమాకు వైద్యులు చికిత్స జరిపారు.అనంతరం కోలుకున్న ఆయన.. మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు బయలుదేరారు. తాను క్షేమంగా ఉన్నట్లు భూమా వెల్లడించారు. ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. జిల్లా స్థాయిలో సరైన వైద్య సౌకర్యాలు లేక..మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరటం అన్నది ఎప్పటికి అంత సురక్షితం కాదనే చెప్పాలి. నేతలు తమకు ఎదురవుతున్న అనుభవాలతో అయినా.. జిల్లా స్థాయిలో మెరుగైన వైద్య సాయం అందించే అత్యాధునిక హాస్పిటల్స్ ఏర్పాటు దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి.. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దృష్టి సారిస్తే బాగుండు.