Begin typing your search above and press return to search.
భూమా ఇక రౌడీ కాదట..!!
By: Tupaki Desk | 26 Sep 2016 6:58 AM GMTకర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులు నమోదు చేసిన రౌడీషీట్ ఎత్తివేతకు రంగం సిద్ధమవుతోంది. ఆయనపై సుమారు రెండేళ్ల క్రితం పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. ఆ కేసులో భూమా నాగిరెడ్డి రిమాండుకు కూడా వెళ్లి వచ్చారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. అయితే.. ఆలోగానే భూమా వైసీపీ నుంచి టీడీపీలోకి రావడం.. ఇప్పుడు కేసును ఎత్తివేయించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
భూమా ఈ ఏడాది ప్రారంభంలోనే వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తరువాత ఆయనను మంత్రివర్గంలో చేర్చుకుంటారని ప్రచారం జరిగింది.
గత జూన్‌లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావించినా జాప్యం జరుగుతూ వచ్చింది. దసరా తరువాత మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని ఇప్పుడు కొత్తగా ప్రచారం జరుగుతోంది. కర్నూలు జిల్లాలో టిడిపి బలం పెరగాలంటే నాగిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని టీడీపీ సీనియర్లు అంటున్నారట. దీంతో ఆయనకు పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని తెలుస్తోంది. కానీ... రౌడీషీట్ ఉన్న ఎమ్మెల్యేను మంత్రిని చేస్తే విమర్శలు వస్తాయి కాబట్టి దాన్ని ఎత్తివేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
దీంతో నిబంధనల ప్రకారం రౌడీషీట్ ఎత్తివేతకు పోలీసులు చర్యలు తీసుకోవాలన్న సూచన మేరకు నంద్యాల పోలీసులు ఆ మేరకు నివేదిక సిద్ధం చేసి జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణకు పంపినట్లు తెలుస్తోంది. ఆ నివేదికను ఎస్పీ పరిశీలించి సంతృప్తి చెందితే రౌడీషీట్ ఎత్తివేతకు పోలీసులకు ఆదేశాలు జారీ అవుతాయని ఆ శాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది. దీనిపై కొద్ది రోజుల్లోనే నిర్ణయం వెలువడుతుందని వారంటున్నారు. దీంతో భూమా నాగిరెడ్డి మంత్రిపదవికి లైన్ క్లియర్ అవుతుందని టిడిపి నేతలు స్పష్టం చేస్తున్నారు.