Begin typing your search above and press return to search.
శిల్పా.. భూమాల లొల్లి విన్నావా బాబు
By: Tupaki Desk | 5 Nov 2016 5:14 AM GMTమంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందని చెబుతారు. ఏపీలో బలమైన రాజకీయ పక్షంగా మారాలని.. తనను ఢీ కొనే పార్టీ మరేదీ ఉండకూదన్న లక్ష్యంతో ఏ పార్టీ అన్నది చూడకుండా.. అన్ని పార్టీల్లోని నేతల్నిఆహ్వానించిన చంద్రబాబు..వారిని కలిపి ఉంచే విషయంలో మాత్రం అడ్డంగా ఫెయిల్ అవుతున్న పరిస్థితి. క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా భావించే స్థాయి నుంచి అంతర్గత కుమ్ములాటలో నిత్యం మునిగితేలే పరిస్థితుల్నికల్పించటంతో చంద్రబాబు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.
తల్లి కాంగ్రెస్.. పిల్ల కాంగ్రెస్ నుంచి వచ్చిన వలసలతో పార్టీలో ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. పేరుకు ఒకే పార్టీ నేతలైనప్పటికీ.. స్థానికంగా తమ బలాన్ని పెంచుకోవటానికి భిన్న ధ్రువాల్లాంటి నేతలు ఎవరికి వారుగా చేస్తున్న ప్రయత్నాలు పార్టీకి ఇప్పుడు పెద్ద సంకటంగా మారాయని చెప్పాలి. తాజాగా అలాంటి పరిస్థితి కర్నూలు జిల్లా నంద్యాలలో చోటు చేసుకుంది.
ఇక్కడ.. భూమా.. శిల్పా వర్గాల మధ్య రచ్చ అంతా ఇంతా కాదు. దివంగత నేత వైఎస్ హయాంలో మంత్రిగా వ్యవహరించి.. ఒక వెలువు వెలిగిన శిల్పా ఇప్పుడు తెలుగు తమ్ముడిగా మారిపోయిన ముచ్చట తెలిసిందే. ఇక.. టీడీపీ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్లి.. ఆ తర్వాత జగన్ పార్టీలో చేరి.. ఇటీవల కాలంలో టీడీపీ తీర్థం తీసుకున్న భూమాల మధ్య నిత్యం ఏదో ఒక పంచాయితీ నడుస్తూనే ఉంది.
ఇరువర్గాల మధ్య నడుస్తున్న అధిపత్య పోరు పార్టీకి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. అధికారపక్షంగా విపక్షాలపై విరుచుకుపడాల్సింది పోయి.. తమలో తామే తిట్టుకుంటున్న వైనం పార్టీని పలుచన చేసేలా చేస్తుంది. పార్టీని మరింత పటిష్టం చేసేందుకు స్టార్ట్ చేసిన జనచైతన్య యాత్రలు ఇప్పుడు సొంత పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటానికి.. తిట్టుకోవటానికి వేదికగా మార్చుకోవటం తెలుగు తమ్ముళ్లను విస్మయానికి గురి చేసింది.
ముఖ్యనేతల వైఖరికి తగ్గట్లేకిందిస్థాయి నేతలు కూడా.. వర్గాలుగా విడిపోవటంతో.. ఒక వర్గంపై మరో వర్గం చేసుకుంటున్న విమర్శలు.. ఆరోపణలు వాతావరణాన్ని మరింత హాట్ హాట్ గా మారుస్తున్నాయని చెప్పాలి. భూమాకు నంద్యాల వైఎస్ ఛైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్ మద్దుతు ఇస్తుంటే.. శిల్పాకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఛైర్ పర్సన్ సులోచన నిలున్నారు. తాజాగా నిర్వహించిన జనచైతన్య యాత్రల సందర్భంగా ఒక వర్గం మరో వర్గంపై ఆసక్తికర విమర్శలు చేసుకోవటం గమనార్హం.
ఉప్పు.. పప్పులు అమ్ముకునే వారికి రాజకీయాలు ఎందుకంటూ శిల్పా వర్గాన్ని టార్గెట్ చేసిన భూమా.. అలాంటి వారు తనకు పోటీనే కాదని.. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ప్రతి సమావేవంలోనూ తనకు ఓట్లు వేయకుండా ప్రజలను ఓడించారంటూ ప్రజల్ని నిందించటం సరికాదని.. ఇలాంటి వాటిని వదిలేసి ఆత్మపరిశీలన చేసుకోవాలని భూమా వ్యాఖ్యానిస్తుంటే.. ఆయనకు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు శిల్పా.
తాను ఉప్పు.. కందిపప్పు అమ్మింది నిజమే కానీ అది పేద ప్రజలకు లాభం అన్నది చూసుకోకుండా చేసిందని.. భూమా కానీ ఇదే తీరులో మాట్లాడితేరెండు.. మూడు రోజుల్లో ఆయనేం వ్యాపారాలు చేస్తారో తాను ప్రకటిస్తానని హెచ్చరించారు. ఆలోచించి మాట్లాడాలని.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ భూమాకు శిల్ప వార్నింగ్ ఇవ్వటం.. తెలుగు తమ్ముళ్ల మధ్య నలుగుతున్న ఈ అధిపత్య పోరు పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు. వీరిద్దరి లొల్లిపై ఏపీ ముఖ్యమంత్రి కమ్ పార్టీ అధినేత చంద్రబాబు కలుగజేసుకోకపోతే.. పార్టీకి నష్టం వాటిల్లటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.