Begin typing your search above and press return to search.
భూమా చేరికకు డేట్ ఖరారైంది
By: Tupaki Desk | 21 Feb 2016 5:05 AM GMTనంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ తెలుగుదేశం పార్టీలో చేరడంలో నెలకొన్న అస్పష్టత తొలగిపోయింది. వారిద్దరు పచ్చకండువా కప్పుకొనేందుకు సిద్ధమయ్యారనే విషయం ఇటు టీడీపీలోనూ, అటు వైసీపీలోనూ క్లారిటీకి వచ్చింది. ఈ నేపథ్యంలో అసలింతకీ వారు ఎప్పుడు పార్టీలో చేరనున్నారనే చర్చకు ఫుల్‌స్టాప్ పెట్టేలా ఓ తేదీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నందున ఈలోపే తెదేపా తీర్థం పుచ్చుకోవాలని భూమా కుటుంబం సంకల్పించింది. మార్చి 1వ తేదీన విజయవాడలో తెదేపా విస్తృతస్థాయి సమావేశం జరుగుతున్నందున ఆ రోజున భూమా, అఖిలప్రియ ఈ సమావేశానికి హాజరై పార్టీలో చేరుతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 29న తెదేపా పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో భూమా నాగిరెడ్డి చేరుతున్న విషయాన్ని చంద్రబాబు పొలిట్‌బ్యూరో సభ్యులకు ప్రకటిస్తారని సమాచారం. భూమా నివాసంలో ఈ నెల 28న ఓ శుభకార్యం జరుగుతున్నందున ఆ తర్వాతే తెదేపాలో చేరాలన్న నిర్ణయానికి వచ్చి ఈ తేదీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు పార్టీ కండువా మార్చుకునేలోపే ప్రతిపక్ష సభ్యుడిగా దక్కిన పీఏసీ చైర్మన్ పదవికి భూమా రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగే అవకాశాలు ఉన్నాయని, ఇందులో అఖిలప్రియకు అవకాశం దక్కనున్నదని సమాచారం. తాజాగా పార్టీ మార్పుతో భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారు. అయితే తనకు బదులు కూతురు అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వాలని భూమా కోరినట్టు సమాచారం. కర్నూలు జిల్లాలోని రాజకీయ సమీకరణాల ప్రకారం మరో ఎమ్మెల్యేకు పదవి ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అఖిలప్రియకు బెర్త్ కన్ఫర్మ్ కానుంది.