Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే వ‌ర్సెస్ మంత్రి.. చిత్తూరు పాలిటిక్స్ వైసీపీ పాలిటిక్స్ హాట్‌..!

By:  Tupaki Desk   |   6 Nov 2022 1:30 PM GMT
ఎమ్మెల్యే వ‌ర్సెస్ మంత్రి.. చిత్తూరు పాలిటిక్స్ వైసీపీ పాలిటిక్స్ హాట్‌..!
X
ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో టీడీపీ హ‌వాను తోసిపుచ్చి వైసీపీ పాగా వేసిన విష‌యం తెలిసిందే. ఇలా పార్టీని డెవ‌ల‌ప్ చేయ‌డంలో కీల‌క నాయ‌కుడు పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి పాత్ర ఎంతో ఉంది. దీంతో జిల్లాపై స‌ర్వ‌హ‌క్కులు అన్న విధంగా ఆయ‌నే ఇక్క‌డ చ‌క్రం తిప్పుతున్నారు. ఎక్క‌డ ఏ చిన్న అభివృద్ధి జ‌ర‌గాల‌న్నా.. ఆయ‌న చెప్పాల్సిందే. అంతేకాదు... ఏ చిన్న కార్య‌క్ర‌మం చేయాల‌న్నా కూడా ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మూడు రాజ‌ధానుల కోసం వైసీపీ నాయ‌కులు ప‌ట్టుబ‌డుతున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో సీమ నుంచి కూడా కొంద‌రు నాయ‌కులు ఈ వుద్య‌మాన్ని త‌మ భుజాల‌పై మోస్తున్నారు. ఇలాంటి వారిలో తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ముఖ్యంగా ముందున్నారు. ఈయ‌నకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, కార్మిక సంఘాల అండ ఉంది. వారు ఈయ‌న చెప్పిన‌ట్టే న‌డుస్తున్నారు. కొన్ని ద‌శాబ్దాలుగా ఆయ‌న మాటే వేదంగా వారు ప‌నిచేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా సీమ ఆత్మ‌గౌర‌వ ర్యాలీని భూమ‌న నిర్వ‌హిం చారు. ఇది బాగానే జ‌రిగింది. పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నాయ‌కులు పోగ‌య్యారు.

అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ప్లాన్‌ను మంత్రి పెద్దిరెడ్డి కి చూపించ‌లేదు. ఇది వివాదంగా మారింది. ఎందుకంటే.. కొంద‌రు కార్మిక సంఘాల నాయ‌కులు చిత్తూరుకు ఏంటి? ఎన్నాళ్లు ఇలా ఉండాలి. మాకు కూడా పాల‌న రాజ‌ధాని ఇస్తే త‌ప్పులేదు.. అని వ్యాఖ్య‌లు చేశారు. వాస్త‌వానికి ఈ కార్య‌క్ర‌మం ఉద్దేశం అది కాదు. అయినా.. నాయ‌కులు ఎక్క‌డో దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ఇది పెద్దిరెడ్డికి ఇబ్బందిగా మారింది. ఎందుకంటే.. 24 గంట‌ల‌కు ముందే పెద్దిరెడ్డి సీమ ప్ర‌జ‌లు పాల‌నారాజ‌ధాని కోరుకోవ‌డం లేద‌ని చెప్పారు. అలాంటి ఇప్పుడు ఇక్క‌డివారు అదే కావాల‌ని కోరారు.

ఈ ప‌రిణామాల‌తో ఖంగుతిన్న పెద్దిరెడ్డి.. భూమ‌న‌ను సంజాయిషీ ఇవ్వాల‌ని కోరిన‌ట్టుతెలిసింది. ఇదంతా కూడా కేవ‌లం గంట‌ల్లోనే జ‌రిగిపోవ‌డంతో భూమన వ‌ర్గం నివ్వెర‌పోయింది. పెద్దిరెడ్డి సీమ‌కు చెందిన నాయ‌కుడు అయి ఉండిఇలా సంజాయిషీ కోర‌డం ఎందుకు? అనే ప్ర‌శ్న ఉద‌యించింది. అయితే.. భూమ‌న దీనికి తిరుగు ట‌పాలో నేను త్వ‌ర‌లోనే సీఎం జ‌గ‌న్‌ను క‌లుస్తున్నాను. ఆయ‌న‌కే చెబుతానులే అన్నా! అని స‌మాధానం ఇచ్చారు.ఇది పెద్దిరెడ్డిని ఉడికిస్తోంది. మొత్తంగా చూస్తే.. 24 గంట‌ల్లో చిత్తూరు జిల్లా ప‌రిణామాలు హాట్‌హాట్‌గా మారాయి. మ‌రి అధిష్టానం ఏం తేలుస్తుందో చూడాలి.