Begin typing your search above and press return to search.
నోట్ల రద్దుపై భూమన పాయింట్స్ లో నిజముంది
By: Tupaki Desk | 13 Nov 2016 1:57 PM GMTపెద్దనోట్లను రద్దు చేస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న షాకింగ్ నిర్ణయంపైరాజకీయ నేతలు పెద్దగా గళం విప్పనప్పటికీ.. రోజులు గడుస్తున్న కొద్దీ ఈవ్యవహారంపై నెమ్మది నెమ్మదిగా గళం విప్పుతున్నారు. మోడీ నిర్ణయంపైసర్వత్రా హర్షం వ్యక్తమైనప్పటికీ.. రోజులు గడుస్తున్నా చిల్లర నోట్ల కష్టాలుతీరకపోవటం.. ఏటీఎంలు పని చేయకపోవటం.. పని చేసినా.. నగదు లోడ్చేసిన కాసేపటికే అయిపోతుండటం.. కిలోమీటర్ల కొద్దీ క్యూలలో గంటల కొద్దీప్రజలు బారులు తీరిన నేపథ్యంలో.. ప్రజల్లో విసుగు మొదలైంది.
ఇలాంటి తరుణం కోసమే వెయిట్ చేస్తున్న పలువురు నేతలు ఇప్పుడు గళంవిప్పుతున్నారు. పెద్దనోట్ల రద్దుపై కొందరి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా..బయటకు వెళ్లగక్కలేని వారంతా ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనువుగా మార్చుకుంటూ మోడీ సర్కారుపై మరింత ఆగ్రహం కలిగించేలా తమ వ్యాఖ్యాల్ని సంధిస్తున్నారు. రాజకీయం కోసం.. మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ కోసం కొందరు నేతలు గళం విప్పుతుంటే.. మరికొందరు నేతలు మాత్రం ప్రజల సమస్యల్ని.. పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం చేయాల్సిన పనుల్లో చోటు చేసుకున్న తప్పుల్ని ఎత్తి చూపుతూ నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తున్న వారు ఉన్నారు. ఆ తరహాలోనే తాజాగా కొన్ని విమర్శల్ని సంధించారు ఏపీ వైఎస్సార్ కాంగ్రెస్ నేత భూమన కరుణాకర్ రెడ్డి.
పెద్ద నోట్ల రద్దు కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని.. కష్టపడి సంపాదించిన డబ్బును తీసుకోవటానికి బ్యాంకుల వద్ద సామాన్యులు పడిగాపులు కాస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాస్త్రీయఆలోచన చేయకుండా పెద్దనోట్లను రద్దు చేయటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన.. తాజా నిర్ణయం కారణంగా 50 కోట్ల పని గంటలు వృధా అయినట్లుగా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మరికొన్ని కోట్ల గంటలు అభివృద్ధిలో భాగస్వామి కాకుండా నిరుపయోగంగా ఉండిపోనున్నట్లుగా ఆయన అంచనా వేశారు.
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఆత్మహత్యలకు దారి తీస్తోందని.. కొన్ని వేల పెళ్లిళ్లు ఆగిపోయినట్లుగా భూమన వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా మహిళల బాధ వర్ణించలేనంతగా మారిందన్నారు. భూమన చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దనోట్ల రద్దుతో తమ వద్ద ఉన్న డబ్బుల్ని మార్చుకోవటం కోసం.. తక్షణ అవసరాలకు సరిపడా చిన్న నోట్ల కోసం కోట్లాది మంది గంటల తరబడి క్యూలలో ఉండిపోవటం ఉత్పాదకతపై పెను ప్రభావాన్ని చూపిస్తుందనటంలో సందేహం లేదు. ఏటీఎం కష్టాలు.. బ్యాంకుల ముందు క్యూలను వీలైనంత తగ్గిపోయేలా మోడీ సర్కారు చేస్తే.. ప్రజల్లో ఆగ్రహం కూడా చల్లబడటమే కాదు.. రాజకీయ నేతల గొంతులు కూడా మూగపోతాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ విషయంలో జరిగే ఆలస్యం మోడీ సర్కారుకే ఇబ్బందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/