Begin typing your search above and press return to search.
బాబు ఇల్లా..మజాకా?:అడుగు మార్బుల్ 30వేలు!
By: Tupaki Desk | 11 April 2017 9:45 AM GMTహైదరాబాద్‌లో ఘనంగా కట్టించుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ముచ్చట ఇప్పుడు వివాదంగా మారుతోంది. భూతల స్వర్గం లాంటి ప్యాలెస్ ఇంటి గృహప్రవేశాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేయటమే కాదు.. నిత్యం మీడియాతో గంటల కొద్దీ మాట్లాడేందుకు.. కనిపించేందుకు తహతహలాడే బాబు..తన కొత్త ఇంటిని ఎవరికీ చూపించేందుకు అస్సలు ఇష్టపడలేదు. బాబు కొత్తింటి విషయాన్ని పలువురు తప్పు పడుతున్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమాన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు ఆసక్తికరంగానే కాదు.. బాబు ఇంటికి సంబంధించిన కొత్త యాంగిల్ కనిపించేలా చేస్తున్నాయి.
హైదరాబాద్ ఇంటిని వందల కోట్ల రూపాయిల ఖర్చుతో నిర్మించారని.. ఆయన రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారో చెప్పాలని నిలదీశారు భూమాన. ఏపీ ఉద్యోగుల్ని అమరావతికి తరలించిన సీఎం చంద్రబాబు.. తన ఇంటిని మాత్రం ఎందుకు హైదరాబాద్ లో కట్టుకున్నారని ప్రశ్నించారు. ఇంటి కోసం వందల కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్లుగా ఆరోపించిన ఆయన.. ఇంటిని అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందన్నారు. ఇంటికి సంబంధించిన విషయాల్ని ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బాబు ఇంటికి సంబంధించిన కొత్త విషయాల్ని కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. బాబు కొత్తింటి నిర్మాణంలో అత్యంత ఖరీదైన విదేశీ వస్తువుల్ని వాడారని.. ఇంటి మార్బుల్ విషయానికి వస్తే.. అడుగు రూ.30వేల నుంచి రూ.40వేల వరకూ ఖర్చు చేశారన్న ఆయన.. బాబు ఇల్లంతా ఇటాలియన్ మార్బుల్స్ వాడారన్నారు. అమరావతిని అది చేస్తా.. ఇది చేస్తానని చెప్పిన బాబు.. తన ఇంటిని మాత్రం సింగపూర్.. దావోస్.. షాంఘై తరహాలో విలాసవంతంగా.. భారీగా నిర్మించారన్నారు. ప్రతిపక్ష నేత జగన్ ఇల్లు తెరిచిన పుస్తకమని.. ఆయన ఇంటికి నిత్యం వందలాది మంది వస్తుంటారని.. సీఎం చంద్రబాబు మాత్రం తనింటిని రహస్యంగా ఉంచారని తప్పు పట్టారు. కరుణాకర్ రెడ్డి మాటలు వింటుంటే.. రానున్న రోజుల్లో బాబు ఇంటి ముచ్చట ఆయనకు గుదిబండలా మారే ప్రమాదం కనిపిస్తుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/