Begin typing your search above and press return to search.
జగన్ బెయిల్ వెనుక ఢిల్లీ చక్రం?
By: Tupaki Desk | 28 April 2017 1:34 PM GMTవైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత - ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అధికార తెలుగుదేశం పార్టీ విమర్శలు చేయడంపై వైఎస్ ఆర్ సీపీ మండిపడింది. ప్రజాక్షేత్రంలో జగన్ ను ఎదుర్కొనే దమ్ములేని పాపిష్టి సీఎం చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నాడని ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ బెయిల్ రద్దు అంటూ పనిగట్టుకొని కొన్ని మీడియా ఛానళ్లు ప్రసారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బెయిల్ రద్దు ప్రసారాల వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం పరిపూర్ణంగా ఉందన్నారు. వైఎస్ జగన్ పై అక్రమ కేసులు బనాయించింది చాలక ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా చంద్రబాబు, కొన్ని మీడియా ఛానళ్లు వ్యవహరిస్తున్నాయని భూమన విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ లోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన కరుణాకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైఎస్ జగన్ లోటస్ పాండ్ నివాసం నుంచి బయల్దేరినప్పటి నుంచి కొన్ని న్యూస్ ఛానల్స్ వాహనాలు వెంబడించి వైఎస్ జగన్ బెయిల్ రద్దు కాబోతుంది.. రద్దు అయినట్లుగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వేసిన పిటీషన్ ను కూడా న్యాయస్థానం కొట్టేసిందని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో వైఎస్ జగన్ ను నిలవరించే శక్తిలేక ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రసార మాధ్యమాలను బెదిరించి, లొంగదీసుకొని బెయిల్ కు సంబంధించి కథనాలు అల్లించి - నిరంతరం ఇదే అంశంపై తన నాయకులతో మాట్లాడించే ప్రయత్నాలు చంద్రబాబు చేశారని భూమన దుయ్యబట్టారు.
ఎన్డీయే ప్రభుత్వంలో సీబీఐ సరిగ్గా పనిచేయడం లేదని టీడీపీ నేతలు అనడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ - ఏపీ సీఎం చంద్రబాబు కలిసి వైఎస్ జగన్ పై అక్రమంగా కేసులు బనాయించారనే నిజం బహిర్గతమైందని భూమన అన్నారు. సోనియాగాంధీతో చేతులు కలిసి వైఎస్ జగన్ ను జైలుకు పంపగలిగాం అనే అర్థం వచ్చే రీతిలో నిసిగ్గుగా టీడీపీలు పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడుతున్నారన్నారు. వైఎస్ జగన్ ఢిల్లీకి వెళితే.. బెయిల్ రద్దు భయంతోనే వెళ్లారని ఓ మంత్రి - బెయిల్ రద్దు కాక తప్పదని సాక్షాత్తు చంద్రబాబే మాట్లాడుతున్నారంటే సరైన పాలన అందించలేక ఒక బలమైన ధీశాలి - సమస్యలపై ప్రతిఘటించడంలో నిరంతరం వెనుకాడని శక్తిసామర్థ్యుడు వైఎస్ జగన్ అంటే ఎంత భయమో అర్థమవుతుందన్నారు. బెయిల్ రద్దు పిటిషన్ ఏ విధంగానైతే కొట్టివేయబడిందో ఏ తప్పు చేయని వైఎస్ జగన్ మీద తీర్పు కూడా సానుకూలంగా వస్తుందనే ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు. సోనియా - చంద్రబాబులు అక్రమంగా వైఎస్ జగన్ పై బనాయించిన కేసుల్లోంచి కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తారని, న్యాయస్థానం తీర్పులపై మా పార్టీకి ప్రగాఢ విశ్వాసం ఉందని పురుద్ఘాటించారు. నిజం ఎప్పటికీ దాగదని చంద్రబాబును హెచ్చరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/