Begin typing your search above and press return to search.

లోకేశ్‌.. ఓ పెద్ద సూట్ కేస్‌

By:  Tupaki Desk   |   30 May 2017 9:43 AM GMT
లోకేశ్‌.. ఓ పెద్ద సూట్ కేస్‌
X
ఏపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత భూమాన క‌రుణాక‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడు.. మంత్రి నారా లోకేశ్‌ పై ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. లోకేశ్‌.. ఓ పెద్ద సూట్ కేస్ అన్న ఆయ‌న‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. బీజేపీ కానీ తోడు లేకుంటే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం సాధించేదా? అని ప్ర‌శ్నించారు. కేవ‌లం ఒక్క‌శాతం ఓట్ల తేడాతో ఎన్నిక‌ల్లో విజ‌యాన్ని సాధించిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు.

మ‌హానాడు వేదిక‌గా జ‌గ‌న్‌ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌కు లోకేశ్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని భూమాన డిమాండ్ చేశారు. సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్ మీదా.. ష‌ర్మిల మీద పోస్టులు పెట్టిన వైనాన్ని ఆయ‌న ప్ర‌శ్నించారు. జ‌గ‌న్‌ ను.. ఆయ‌న సోద‌రి ష‌ర్మిల‌ను కించ‌ప‌రిచేలా పోస్టులు పెట్టిన‌ప్పుడు ఏం చేశార‌ని ప్ర‌శ్నించిన భూమాన‌.. ఏపీలో మ‌ళ్లీ వైఎస్ పాల‌న రావాలంటే జ‌గ‌న్ ను సీఎంను చేయాల్సిందేన‌న్నారు.

జ‌గ‌న్‌ ను ముఖ్య‌మంత్రిని చేయ‌టానికి ప్ర‌తి ఒక్క‌రూ శ‌క్తవంచ‌న లేకుండా కృషి చేయాల‌న్నారు. తిరుప‌తిలో ప్రారంభ‌మైన తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీలో మాట్లాడిన ఆయ‌న‌.. అబ‌ద్ధ‌పు వాగ్దానాల‌తో.. నెర‌వేర్చ‌ని హామీల్ని చెప్పి చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చార‌న్నారు.

బాబు మాదిరే అబ‌ద్ధ‌పు హామీల్ని జ‌గ‌న్ కానీ ఇచ్చి ఉంటే ఆయ‌న సీఎం అయ్యే వార‌న్నారు. కానీ.. ప్ర‌జ‌ల్ని మోసం చేయ‌టం తమ తీరు కాద‌న్నారు. మ‌రోనేత పార్థ‌సార‌ధి మాట్లాడుతూ లోకేశ్ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. విశాఖ‌లో జ‌రిగిన మ‌హానాడులో లోకేశ్ ప్ర‌సంగం వింటే ఉత్త‌ర‌కుమారుడు గుర్తుకు వ‌చ్చేలా ఉంద‌న్నారు. కుల‌పిచ్చి.. మ‌త‌పిచ్చి.. అవినీతి పిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీగా ఆయ‌న మండిప‌డ్డారు.వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని.. జ‌గ‌న్ ను విమ‌ర్శిస్తే గొప్ప‌వాడినైపోతాన‌ని అనుకోవ‌టం భ్ర‌మ అన్న పార్థ‌సార‌థి.. ఏపీ అభివృద్ధికి జ‌గ‌న్ అడ్డుప‌డ్డార‌న్న వ్యాఖ్య ఎలా చేస్తార‌ని ప్ర‌శ్నించారు. చేసిన విమ‌ర్శ‌ను నిరూపించుకోగ‌ల‌రా? అంటూ నిల‌దీశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/