Begin typing your search above and press return to search.

నారావారి పాల‌న‌.. నీరో పాల‌న‌ట‌!

By:  Tupaki Desk   |   27 Aug 2017 4:31 AM GMT
నారావారి పాల‌న‌.. నీరో పాల‌న‌ట‌!
X
కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కొస్తున్న కొద్దీ టీడీపీ, వైసీపీ మ‌ధ్య మాట‌ల వార్ జ‌రుగుతోంది. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై వైసీపీ నేత‌లు సంధిస్తున్న‌ప్ర‌శ్న‌ల‌కు టీడీపీ దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోతోంది. స‌మాధానాలు చెప్పాల్సిం ది పోయి.. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్న విష‌యం తెలిసిందే! అబద్ద‌పు హామీలు ఇచ్చి మూడేళ్లు దాటిపోయిం ది! ప్ర‌జ‌ల న‌మ్మ‌కంపై మూడేళ్ల క్రితం టీడీపీ క‌ట్టిన కోట‌.. ఇప్పుడు క్ర‌మంగా బీట‌లు వారుతోంది. ఇదే క్ర‌మంలో అవినీతి పెరిగిపోయింద‌నే విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మూడేళ్ల నారావారి పాల‌న‌పై వైసీపీ నేత భూమన కరుణాక‌ర్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. అది నారావారి పాల‌న కాద‌ని.. నీరో పాల‌న కంటే అధ్వాన‌మంటూ ఎద్దేవా చేశారు.

మూడున్నరే ళ్లలో ఏపీకి సీఎం చంద్రబాబు ఒరగబెట్టింది ఏమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి విమ‌ర్శించారు. నారావారి పాలన నీరో పాలన కంటే అధ్వానంగా ఉంద‌ని సెటైర్ వేశారు. 600 అబద్ధాల హామీలతో రాష్ట్ర ప్రజలను వంచించిన చంద్రబాబు, ఇప్పుడు అబద్ధపు హామీతో కాకినాడను కలుషితం చేస్తు న్నారని విమ‌ర్శించారు. నంద్యాల తరహాలోనే కాకినాడలోనూ నాటకాలాడుతున్నారన్నారు. మళ్లీ మోసపోయేందుకు కాకినాడ ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. అవినీతి సొమ్ము కూడ‌బెట్టిన నేత‌లు ప్ర‌చారానికి వ‌స్తున్నార‌ని.. కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో చంద్ర‌బాబు అన్న విష‌యం తెలిసిందే! దీనిపై భూమన‌ కౌంట‌ర్ ఇచ్చారు.

మూడున్నరేళ్లలో మూడున్నర లక్షల కోట్ల అవినీతి చేశార‌ని, అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించే దమ్ముందా? అని చంద్రబాబును భూమ‌న‌ ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో ఇప్పుడు ప్రజలను కలుషితం చేసేందకు టీడీపీ అధినేత ప్రయత్నిస్తున్నారని భూమన తెలిపారు. అ అంటే అధికారం.. ఆ అంటే ఆదాయం అన్నట్లుగా బాబు తీరు ఉంద‌ని ఎద్దేవా చేశారు. అ అంటే అమ‌రావ‌తి, ఆ అంటే ఆంధ్ర‌ప్రదేశ్ అని చంద్ర‌బాబు చెబుతుంటారు. ఇప్పుడు దీనికి కొత్త నిర్వ‌చ‌నం చెప్పారు భూమ‌న‌!!