Begin typing your search above and press return to search.

మంత్రులా...మంత్ర‌గాళ్ల అర్థం కావ‌డం లేదు

By:  Tupaki Desk   |   3 Aug 2017 10:24 AM GMT
మంత్రులా...మంత్ర‌గాళ్ల అర్థం కావ‌డం లేదు
X
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహ‌న్ రెడ్డి నంద్యాలకు వస్తుంటే అభివృద్ధి నిరోధకుడిని అడ్డుకోండంటూ బాబు మాట్లాడటాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. శాంతియుత పద్ధతుల ద్వారా ఓట్లను అభ్యర్థించకుండా మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న టీడీపీ అధికార దాహాన్నినంద్యాల వేదికగా వైఎస్ జగన్ ఎండగడుతార‌నే భ‌యంతోనే టీడీపీ గూండాలతో వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు మంత్రులు కుట్రలు చేస్తున్నారని మండిప‌డ్డారు. నంద్యాల ఉపఎన్నిక ఆర్కేనగర్ ఉపఎన్నిక కన్నా దారుణంగా తయారవుతోందని భూమన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార టీడీపీ నంద్యాలలో వందల కోట్ల అవినీతి సొమ్మును పంచుతూ...వైఎస్సార్సీపీ నాయకులను బెదిరిస్తూ, ఓటర్లను ప్రలోభపెడుతోందని భూమన ధ్వజమెత్తారు. ప్రజలు బాబుపై తిరుగుబాటు చేస్తుండడంతో బరితెగించి హింసాయుత పద్ధతుల్లో గెలవాలని చూస్తున్నాడని భూమన ఆరోపించారు.

వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే టీడీపీ భూ స్థాపితమవుతుందన్నభయంతో మంత్రుల చెప్పుచేతల్లో టీడీపీ గూండాలు అరాచకం సృష్టించేందుకు పన్నాగం పన్నినట్టుగా అర్థమవుతోందని భూమ‌న అన్నారు. ఇదేనా బాబు ప్రజాస్వామ్యం అని భూమన ప్రశ్నించారు. నంద్యాలలో ఉన్నది మంత్రులా లేక మంత్రగాళ్లో అర్థం కావడం లేదన్నారు. అఘోరాల కంటే అధ్వాన్నంగా ప్రజల ఆశయాలను చేతబడి చేసే మంత్రగాళ్లలాగ మంత్రులు తయారయ్యారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను బెదిరించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. నిజంగా అభివృద్ధి చేశారని అనుకుంటే మంత్రులంతా అమరావతిని వదిలి నంద్యాలలో ఎందుకు తిష్టవేశారని, 70 మంది ఎమ్మెల్యేలను ఎందుకు దించారని భూమన ప్రశ్నించారు. చంద్రబాబు మూడేళ్లలో మూడున్నర లక్షల కోట్లు దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమకుందని అన్నారు.

నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో బాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం కూడ అంతే ఉంటుందని భూమన ఎద్దేవా చేశారు. బాబు మూడేళ్లుగా చేసిన ద్రోహానికి తీర్పు ఇచ్చేందుకు మొదటి అవకాశం నంద్యాల ప్రజలకు దక్కిందని.. చంద్రబాబు అవినీతి, అరాచక పాలనను పాతరేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భూమన తెలిపారు. ప్రజలంతా వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిసి బాబు ఓటర్లను భయభ్రాంతులను గురిచేస్తూ హింసాయుత వాతావరణం సృష్టిస్తున్నారని భూమన ఆగ్రహించారు. ముఠా రాజకీయాలు చేస్తూ పోలీస్ యంత్రాంగాన్ని చెప్పుచేతల్లో పెట్టుకొని ఏకపక్షంగా ఎన్నికలు జరపాలన్న కుట్ర చేస్తున్నాడని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, బాబు హింసాయుత రాజకీయాలకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వందలకోట్లు పంచేందుకు చంద్రబాబు లారీల్లో 2వేల కోట్లను నంద్యాలకు తరలించారని భూమన ఫైర్ అయ్యారు.

నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో బాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం కూడ అంతే ఉంటుందని భూమన ఎద్దేవా చేశారు. బాబు మూడేళ్లుగా చేసిన ద్రోహానికి తీర్పు ఇచ్చేందుకు మొదటి అవకాశం నంద్యాల ప్రజలకు దక్కిందని.. చంద్రబాబు అవినీతి, అరాచక పాలనను పాతరేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భూమన తెలిపారు. ప్రజలంతా వైఎస్సార్సీపీ - వైఎస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిసి బాబు ఓటర్లను భయభ్రాంతులను గురిచేస్తూ హింసాయిత వాతావరణం సృష్టిస్తున్నారని భూమన ఆగ్రహించారు. ముఠా రాజకీయాలు చేస్తూ పోలీస్ యంత్రాంగాన్ని చెప్పుచేతల్లో పెట్టుకొని ఏకపక్షంగా ఎన్నికలు జరపాలన్న కుట్ర చేస్తున్నాడని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, బాబు హింసాయుత రాజకీయాలకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, నిఘా సంస్థలు, ఇన్ కం ట్యాక్స్ సంస్థలన్నీ బాబుకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని భూమన సూచించారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు బెదిరే కుందేళ్లు వైఎస్సార్సీపీలో లేరని భూమన అన్నారు. ప్రజాస్వామ్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, నిఘా సంస్థలు, ఇన్ కం ట్యాక్స్ సంస్థలన్నీ బాబుకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని భూమన సూచించారు.