Begin typing your search above and press return to search.
జగన్ పై ఈడీ దాడులు...బాబు ఎత్తులు
By: Tupaki Desk | 20 May 2017 2:57 PM GMTప్రధానమంత్రి నరేంద్రమోడీతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం అవడంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులో వణుకు ప్రారంభమయిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధానిని ఎందుకు కలిశారో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా ఆరోజే మీడియా సమక్షంలో వివరించినప్పటికీ ఇంకా విమర్శలు చేయడాన్ని బట్టి జగన్ ఎక్కడ తన అవినీతి గురించి మోడీకి వివరించాడోనని బాబు వణుకుతున్నాడని ఎద్దేవా చేశారు. ``అంత ఏకాంతంగా గంట పాటు మోడీ నాతో కూడా మాట్లాడలేదు. ఏం చెప్పాడో అని చంద్రబాబు భయంతో చస్తున్నాడు. రాష్ట్రంలో రూ. రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడినందుకే చంద్రబాబుకు ఇంత వణుకు`` అంటూ భూమన మండిపడ్డారు. హైదరాబాద్ లోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నిరంతరం ప్రజల క్షేమం కోసం పోరాటం చేసే ప్రతిపక్షనేత వైయస్ జగన్ పై విమర్శలు చేయడం సరికాదన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ, వైఎస్ జగన్ ల భేటీ విషయంలో దాపరికంతో కూడిన అజెండాలు లేవని భూమన స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ఫిబ్రవరి 17వ తేదిన ప్రధానికి లేఖ రాసిన మాట వాస్తవం అని భూమన అన్నారు.``ప్రధానితో సమావేశం సందర్భంగా వైఎస్ జగన్ ఎక్కడ విచారణకు మోడీని ఒప్పించాడో.. నా అక్రమాలు ఎక్కడ చెప్పాడో అనే భయంతో వణికి చస్తూ వైఎస్ జగన్ పై నీచ పదజాలంతో విమర్శలు చేయిస్తున్నాడు. అధికారంలో ఉన్న వ్యక్తులుగా వ్యవస్థలను మ్యానేజ్ చేయగలం అని స్పష్టంగా చంద్రబాబు చెబుతుండటాన్ని బట్టి చూస్తే...ప్రధాని, సుప్రీం కోర్టు, సీబీఐ, ఈడీలు మ్యానేజ్ కాబడతారని అని అర్థమవుతుంది. ఈడీలో నీ తొత్తులుగా వ్యవహరిస్తున్న ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనే అధికారులతో నీకున్న సంబంధ బాంధవ్యాలు ఏంటి? చంద్రబాబు తొత్తులుగా వ్యవహరిస్తున్న ఉమాశంకర్ గౌడ్, గాంధీలపై విచారణ జరిపిస్తే చంద్రబాబు బతుకు బస్టాండే`` అని భూమన అన్నారు.
ఏ మాత్రం రాజకీయ విలువలు లేకుండా వైఎస్ జగన్ అనే వీరుడిపై ప్రధానిని కలిసినందుకు విమర్శలు చేయడం సిగ్గుచేటని భూమన అన్నారు. `గతంలో ఎన్టీఆర్‌తో, మరోసారి ఎన్డీఏతో, ఇంకోసారి పవన్ కళ్యాణతో పక్కన ఉంటేనే నువ్వు పదిగా మారుతావు. లేకపోతే నువ్వు సున్నా`` అని విమర్శించారు. ఒక్కడిగా పోటీ చేసిన 2004 సంవత్సరంలో దిక్కుతోచని స్థితికి టీడీపీ వెళ్లిపోయిన సంగతి గుర్తు లేదా అని ప్రశ్నించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నేతలను ఏ విధంగా జైలుకు పంపాలా అని అధికారాన్ని వాడుతున్నందుకు చంద్రబాబు నిరంతరం జైల్లో ఉండాల్సిన అవసరం ఉందని భూమన అన్నారు. బ్యాంక్ లకు డబ్బులు ఎగ్గొట్టిన గంటా, సుజనా చౌదరి, రాయపాటి సాంబశివరావులను వెంట బెట్టుకొని నిసిగ్గుగా బజారునపడి తిరుగుతుంటే వాళ్లను గురించి ఒక్క మాట మాట్లాడలేదెందుకని నిలదీశారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పు. నిజంగా మోడీపై అనుమానం ఉంటే... నీకు సిగ్గు - ఎగ్గు - లజ్జ ఉంటే మోడీ ప్రభుత్వం నుంచి బయటకు రా..అని సవాలు విసిరారు. ఎందుకు ఇంకా బేతాలుడి భుజం మీద శవం వేలాడుతున్నట్లు ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగుతున్నావ్ చంద్రబాబు అని నిప్పులు చెరిగారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/