Begin typing your search above and press return to search.

చిదంబ‌రం..కేసీఆర్ ల‌తో అలా చేశావా బాబు?

By:  Tupaki Desk   |   18 March 2018 12:30 PM GMT
చిదంబ‌రం..కేసీఆర్ ల‌తో అలా చేశావా బాబు?
X
ఏపీ అధికార‌.. విప‌క్షాల మ‌ధ్య న‌డుస్తున్న మాట‌ల యుద్ధంలో మ‌రొక‌రు ఎంట్రీ ఇచ్చారు. ఇప్ప‌టికే ప‌లువురు టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు మాట‌ల యుద్ధం చేసుకుంటున్న వేళ‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత భూమాన క‌రుణాక‌ర్ రెడ్డి ఫైర్ అయ్యారు.

వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేయ‌టంలో చంద్ర‌బాబు దిట్ట‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. దేన్నైనా మేనేజ్ చేయ‌గ‌ల‌న‌ని న‌మ్మే వ్య‌క్తి చంద్ర‌బాబు అన్న ఆయ‌న‌.. సోనియా అడుగుల‌కు మ‌డుగులు ఒత్తిన చంద్ర‌బాబు అక్ర‌మ కేసుల‌తో వైఎస్ జ‌గ‌న్ ను జైలుకు పంపారంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

జ‌గ‌న్ పై పెట్టిన కేసుల్ని కోర్టుల్లో కొట్టేస్తారేమోన‌ని చంద్ర‌బాబు అంటున్నార‌ని.. త‌మ‌కు కోర్టుల‌పై న‌మ్మ‌కం ఉంద‌న్నారు. చ‌ట్టాల్ని తాము గౌర‌విస్తామ‌ని.. జ‌గ‌న్ ను రాజ‌కీయంగా ఎదుర్కోలేమ‌న్న ఆలోచ‌న‌తో సీబీఐని ఉసిగొల్పి సోనియా.. చంద్ర‌బాబులు ఇద్ద‌రు క‌లిసి అక్ర‌మ కేసులు పెట్టించార్నారు.

జ‌గ‌న్ ను ఎదుర్కొనేందుకు చిదంబ‌రం కాళ్ల‌ను చంద్ర‌బాబు ప‌ట్టుకున్న‌ది నిజం కాదా? అని ప్ర‌శ్నించిన భూమ‌న‌.. యూపీఏ స‌ర్కారులోన్యాయ‌శాఖా మంత్రిగా ఉన్న భ‌రద్వాజ కాళ్ల‌కు న‌మ‌స్కారం చేయ‌లేదా? అని నిల‌దీశారు. ఓట్ల‌కు నోట్ల కేసులో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు భ‌య‌ప‌డి.. ఆయ‌న‌కు సాస్టాంగ న‌మ‌స్కారం చేసి విజ‌య‌వాడ‌కు పారిపోయి రాలేదా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. జ‌గ‌న్ మీద ఉన్న అక్క‌సుతో నాటి ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ తో కుమ్మ‌క్కు కాలేదా? అని ప్ర‌శ్నించారు.

ఇలా చెప్పుకుంటూ పోతే చంద్ర‌బాబు చ‌రిత్ర చాలానే ఉంద‌ని.. అలాంటి బాబుకు త‌మ గురించి మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌న్నారు. సోనియాకు జేజేలు కొట్టి ఉండే ఎనిమిదేళ్ల క్రిత‌మే జ‌గ‌న్ సీఎం అయ్యే వార‌న్నారు. బాబు మాదిరి ప‌ద‌వుల కోసం పాకులాడ‌టం జ‌గ‌న్ కు రాద‌న్నారు. త‌న‌కు తాను క‌డిగిన ముత్యం మాదిరి చెప్పుకునే చంద్ర‌బాబుకు.. గ‌తాన్ని గుర్తుకు వ‌చ్చేలా భూమాన విసిరిన విమ‌ర్శ‌నాస్త్రాలు చూస్తే.. వాడి వేడిగా ఉంట‌మే కాక త‌మ్ముళ్ల‌ను డిఫెన్స్ లో ప‌డేస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

చంద్ర‌బాబు పాల‌న‌ను ప‌చ్చ ప‌త్రిక‌లు ఆకాశానికి ఎత్తేయ‌టంపై క‌రుణా అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ప్ర‌త్యేక హోదా అనే ప‌దానికి బాబు స‌మాధి క‌డితే.. దాన్ని ప్ర‌జ‌ల్లో స‌జీవంగా ఉంచింది జ‌గ‌న్ అన్నది మ‌ర్చిపోకూడ‌ద‌న్నారు. ప‌చ్చ ప‌త్రిక‌ల‌న్నీ ఊహ‌ల్లో ఉన్నాయ‌న్న భూమానా.. నారాసుర పాల‌నను అంతమొందించ‌టానికి రాష్ట్ర ప్ర‌జ‌లంతా సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు. హోదాపై కేంద్రంపై త‌మ పార్టీ అవిశ్వాసం పెడితే దేశ వ్యాప్తంగా ప‌లు పార్టీలు మ‌ద్ద‌తు ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేశారు.