Begin typing your search above and press return to search.
వైసీపీ కీలక నేతకు పుత్రోత్సాహం కరువేనా ?
By: Tupaki Desk | 8 May 2021 4:06 AM GMTతిరుపతి ఎమ్మెల్యే, వైసీపీ కీలక నాయకుడు, వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడు.. భూమన కరుణాక ర్ రెడ్డి.. తన వారసుడిని ఎలివేట్ చేసుకోలేక పోతున్నారు. రాజకీయాల్లో వారసులను పైకి తీసుకురావడం.. ఇప్పుడున్న సీనియర్లకు చాలా ఇబ్బందిగా మారింది. వారిలో సత్తా లేకపోవడం.. లేదా.. రాజకీయంగా వారికి ప్రజల నుంచి మద్దతు లభించకపోవడం వంటివి వారసత్వ రాజకీయాలకు ఇబ్బందిగా మారింది. ఈ తరహా పరిస్థితి ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఎక్కువగా కనిపిస్తోంది.
అయితే.. వైసీపీలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఇక్కడ వారసులు అంతో ఇంతో ఎలివేట్ అవుతున్నా రు. అనేక మంది వారసులు ఎన్నికల్లో గెలిచి.. సత్తా చాటుకున్నారు.కానీ, ఇలాంటి వారిలో కొందరికి మాత్ర మే పదవులు దక్కుతుండగా.. మరికొందరు మాత్రం నోరెళ్లబెట్టి చూస్తున్నారు. దీనికి రీజనేంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే పరిస్థితి భూమన కరుణాకర్ రెడ్డి విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి యూత్ లీడర్‌గా వైసీపీలో పనిచేస్తు న్నారు.
తిరుపతిలో ఏ కార్యక్రమం నిర్వహించినా.. ఆయన ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ క్రమంలోనే తిరుపతి స్థానిక ఎన్నికల్లో ఆయనకు అవకాశం ఇప్పించుకున్న భూమన.. మేయర్ పీఠంపై చూడాలని భావించారు. అయితే.. దీనికి చివరి వరకు అవకాశం కోసం ఎదురు చూసినా.. కీలక మంత్రి ఒకరు అడ్డుపడ్డారనే వాదన ఉంది. నిజానికి ఇక్కడ సీటును మహిళకు కేటాయించినా.. డిప్యూటీ మేయర్ అయినా.. దక్కుతుందని అనుకున్నారు. దీనికి కూడా సదరు మంత్రి వర్యులు అడ్డుపడ్డారని.. భూమన వర్గం అప్పట్లోనే వాదించింది.
ఇక, ఇప్పటికీ.. ఈ అసంతృప్తి భూమన కుటుంబాన్ని వెంటాడుతోంది. ఇదిలావుంటే, వచ్చే 2024 ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ ఇప్పించుకునేందుకు భూమన గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. తన తిరుపతి సీటును ఇవ్వ డం కాకుండా.. వేరే చోట టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే.. జిల్లాకు చెందిన కీలక మంత్రి ఒకరు.. ఈ ప్రతిపాదనకు అడ్డు పడుతున్నారని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. కరుణా కరుణాకర్ రెడ్డిలో పుత్రోత్సాహం ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.