Begin typing your search above and press return to search.
సంచలనంగా భూపాలపల్లి ఎక్సైజ్ ఉన్నతాధికారి వెకిలితనం
By: Tupaki Desk | 5 Jun 2020 7:30 AM GMTఎక్సైజ్ శాఖలో అతడో ఉన్నతాధికారి. పేరుకు పెద్ద అధికారే అయినా మనసు మాత్రం చిన్నది. అతగాడి వెకిలితనం అదే శాఖలో పని చేసే మహిళా సీఐకి శాపంగా మారింది. సదరు ఉన్నతాధికారి వెకిలిచేష్టలు భరించలేని ఆమె.. తాజాగా ఒక మీడియా సంస్థ ముందుకు వచ్చి తన వేదనను వెళ్లబోసుకుంది. తనను ఎంతగా టార్చర్ పెడుతున్నాడో వెల్లడించింది. ఆమె చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
భూపాలపల్లి ఎక్సైజ్ సూపరిటెండెంట్ తనను ఎంతలా టార్చర్ పెడుతున్న విషయాన్ని ఎక్సజ్ సీఐ ప్రశాంతి వెల్లడించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. వాట్సాప్ లో పోస్టులు పెట్టటంతో పాటు.. తానుండే క్వార్టర్ పక్కనే క్వార్టర్ ఇప్పిస్తానని.. అక్కడే ఉండి డ్యూటీ చేయాలని ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపించారు. అంతేకాదు.. భూపాలపల్లి ఇన్ చార్జి సీఐ పోస్టు కూడా ఇప్పిస్తానంటూ ఒత్తిడి తెస్తున్న వైనాన్ని ఆమె బయటపెట్టారు. తనకు పెళ్లి అయ్యిందని.. భర్త ఉన్నాడని.. అతడికి ఉద్యోగం ఉంది.. పాపతో తాను ఒక్కతే ఎలా ఉంటానని చెబితే.. ఏమయితది.. పాపతో ఇక్కడే ఉండమన్నట్లు చెప్పారు.
మొదట్లో సదరు ఉన్నతాధికారి తీరు తెలీక.. అతడు స్వయంగా పాడి పంపిన వాట్సాప్ పోస్టుకు బాగుందని రిప్లై ఇచ్చానని.. అప్పటి నుంచి తనను మరింతగా వేధిస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఆమె.. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ తో పాటు.. భూపాలపల్లి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గతంలో పని చేసిన మహిళా అధికారులతోనూ అతడు అలానే వ్యవహరించారని ఆమె చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే.. ఆమె చేసిన ఆరోపణలపై సదరు అధికారిని మీడియా సంప్రదించగా.. ఫోన్ స్విచాఫ్ అయినట్లుగా తెలుస్తోంది.