Begin typing your search above and press return to search.
అసద్ కూడా శ్రీరాముడి వంశస్థుడేనట.. సంచలనంగా బీజేపీ ఎంపీ
By: Tupaki Desk | 16 Feb 2022 4:13 AM GMTయూపీ ఎన్నికల్లో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రభావం ఎంతన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక వాదన ప్రకారం ఆయన ఎప్పుడూ అధికార బీజేపీకి అనుకూలంగా ఉండేలా ఆయన మాటలు.. చేతలు.. ఆయన బరిలో దింపే అభ్యర్థులు ఉంటారని చెబుతారు. బహిరంగంగా చూసినప్పుడు మోడీ అండ్ కోపై తరచూ గుస్సా ప్రదర్శించే ఆయన కారణంగా బీజేపీ లాభపడుతుందన్న వాదనను రాజకీయ పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన యూపీలో ఓవైసీ పార్టీ అభ్యర్థుల పుణ్యమా అని.. బీజేపీకి మేలు జరుగుతుందన్న వాదన ఉంది.
ఇదిలా ఉంటే.. తాజాగా మజ్లిస్ అధినేత పుట్టుపూర్వోత్తరాలను తవ్వి తీసినట్లుగా ఒక బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. ఆయన వంశస్థులు శ్రీరామ చంద్రుని వంశీయులుగా పేర్కొన్నారు. ఈ సంచలన వ్యాఖ్య చేసిన ఎంపీ పేరు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్. యూపీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయనీ సంచలన వ్యాఖ్య చేసినట్లుగా చెబుతున్నారు. ఆయన కుమారుడు ప్రతీక్ భూషణ్ సింగ్ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కైసెర్ గంజ్ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తన కొడుకు విజయం కోసం ప్రచారం చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. తన కొడుక్కి ఓటేయాలని చెప్పే క్రమంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఓవైసీ తనకు పాత మిత్రుడని.. తనకు తెలిసినంత వరకు ఆయన క్షత్రియుడని పేర్కొన్నారు. ఆయన శ్రీరాముడి వంశస్థుడని.. ఇరాన్ కు చెందినవాడు కాదన్నారు. అనంతరం సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ మీద గుస్సా చూపించినా.. ఓవైసీ మీద చేసిన వ్యాఖ్యలతో చూసినప్పుడు అంత ఆసక్తికరంగా అనిపించవు.
ఇంతకూ.. ఓవైసీ శ్రీరాముడి వంశస్థుడని సదరు బీజేపీ ఎంపీకి ఎలా తెలిసింది? ఎలాంటి శాస్త్రీయతతో ఆయనీ వ్యాఖ్యలు చేశారన్నది ప్రశ్న. ఆ విషయం మీద కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుందంటున్నారు. సదరు బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్య పై అసద్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.