Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ట్రస్ట్ ఇక అత్తాకోడళ్ల చేతుల్లో?
By: Tupaki Desk | 11 Jan 2016 7:39 AM GMT మహానటుడు ఎన్టీఆర్ కుమార్తెగా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణిగా హై ప్రొఫైల్ ఉన్న నారా భువనేశ్వరి ఏ కార్యక్రమానికైనా భర్త చంద్రబాబుతో కలిసి వెళ్లడమే కనిపిస్తుంది. ఆమె ఒక్కరే కార్యక్రమాలు నిర్వహించడం కానీ, కార్యక్రమాలకు వెళ్లడం కానీ అత్యంత అరుదనే చెప్పాలి. మీడియాతో మాట్లాడడమూ అరుదే.
తాజాగా ఆమె ఎన్.టి.ఆర్.ట్రస్టులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్.టి.ఆర్ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరం గురించి వివరించారు. ఈ నెల 18న లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ క్యాంప్ ను నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. తెలుగుజాతికి కీర్తి - ప్రతిష్టలు తెచ్చిన మహనీయుడు ఎన్.టి.ఆర్ అని ఆమె అన్నారు. అంతటి మహానుభావుడికి కుమార్తెగా పుట్టడం తన అదృష్టమని ఆమె పేర్కొన్నారు. మెగా రక్తదానం శిబిరంలో ఎన్.టి.ఆర్ అబిమానులంతా పాల్గొనాలని భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు. రక్తదానంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు.
భువనేశ్వరి మునుపెన్నడూ ఇలా కార్యక్రమాల గురించి ఇంత విపులంగా మాట్లాడిన సందర్భాలు లేవు. భర్త చంద్రబాబు, తనయుడు లోకేశ్ లు మాట్లాడడమే తప్ప ఆమె ఎన్నడూ జోక్యం చేసుకున్న పరిస్థితి లేదు. నిజానికి ఎన్టీఆర్ కుమార్తెల్లో పురంధేశ్వరి తప్ప ఎవరూ ప్రజాజీవితంలోకి రాలేదు. కొద్ది నెలల కిందట లోకేశ్ సతీమణి, బాలయ్య కుమార్తె బ్రహ్మణి కూడా ఎన్టీఆర్ ట్రస్టు సేవాకార్యక్రమాలపై విస్తృత స్థాయిలో మాట్లాడారు. చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. ఇప్పుడు భువనేశ్వరి కూడా ఎన్టీఆర్ ట్రస్టు చేపట్టబోయే కార్యక్రమాలపై మాట్లాడారు. దీంతో అత్తాకోడళ్లిద్దరూ ఇకపై ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తారని భావిస్తున్నారు.