Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్: బైడెన్ మంత్రివర్గంలోకి ఇద్దరు భారతీయులు

By:  Tupaki Desk   |   19 Nov 2020 9:30 AM GMT
గుడ్ న్యూస్: బైడెన్ మంత్రివర్గంలోకి ఇద్దరు భారతీయులు
X
అమెరికా కాబోయే అధ్యక్షుడు జోబైడెన్ భారతీయులకు పెద్ద పీట వేస్తున్నారు. ఎన్నికల్లో తనకు ఘన విజయం సాధించిపెట్టడంలో సహకరించిన భారత్ కు చెందిన ఇద్దరు ప్రముఖులను కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జోబైడెన్ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయా విభాగాలకు అధికారులు, మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

భారత్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్న జోబైడెన్.. తన మంత్రివర్గంలోనూ ఇండో-అమెరికన్లకు చోటు కల్పించాలని భావిస్తున్నారట.. బైడెన్, కమలా హారిస్ గెలుపులో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించడంతో వారిని మెప్పించడానికి ఇద్దరు ఇండో అమెరికన్లను కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించారట..

బైడెన్ తన కేబినెట్ కోసం పరిశీలిస్తున్న ఇద్దరు ఇండో అమెరికన్లలో వివేక్ మూర్తి, అరుణ్ మజుందార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయని తెలుస్తోంది. వివేక్ మూర్తి జోబైడెన్ కు సలహాదారుగా ఉన్నారు. ఆయన అమెరికాలో పేరున్న వైద్యుడు. దేశంలోనే ప్రముఖ జనరల్ సర్జన్. ఆయన్ని కేబినెట్ లోకి తీసుకొని ఆరోగ్యశాఖ అప్పగిస్తారని సమాచారం. మరో భారతీయుడు అరణ్ కు ఇంధనశాఖ కేటాయించే అవకాశాలున్నట్టు తెలుస్తోందని అక్కడి మీడియా తెలిపింది.