Begin typing your search above and press return to search.
బైడెన్ సమర్థమంత పాలన.. హామీ కన్నా రెట్టింపు వ్యాక్సినేషన్
By: Tupaki Desk | 10 May 2021 12:30 AM GMTఅమెరికాలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు ఆ దేశ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. బైడెన్ అధికారంలోకి వచ్చాక తొలి వంద రోజుల పాలనా కాలంలో వంద మిలియన్ల మందికి టీకా ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆయన సమర్థవంతంగా పరిపాలించి ఇచ్చిన మాట ప్రకారం కాకుండా రెట్టింపు సంఖ్యలో వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. వంద రోజుల్లో 20 కోట్ల మందికి టీకా పంపిణీ చేశారు. ఇది కేవలం అగ్రరాజ్యాధినేతకు మాత్రమే సాధ్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఆ దేశంలో ప్రస్తుతం రోజూ 30 లక్షల మందికి టీకా ఇస్తున్నట్లు సమాచారం. స్లాట్ బుకింగ్ గడువుకు పెద్దగా సమయం పట్టడం లేదని చెబుతున్నారు. ఇక అక్కడ ప్రజలకు పుష్కలంగా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాజిటివిటీ 5 శాతం కన్నా తక్కువగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మహమ్మారిని కట్టడి చేయడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని భావించిన అమెరికా ప్రభుత్వం... ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
వ్యాక్సిన్ పై ఇప్పటికీ ఆ దేశంలో కొందరికి అనుమానాలు ఉన్నాయి. టీకా పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని బైడెన్ ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగులు, విద్యార్థులకు బహుమతులు, నజరానాలు ప్రకటిస్తూ టీకా ప్రక్రియను క్రియాశీలకంగా మార్చడానికి ప్రణాళిక రచించింది. అగ్రదేశంలో ఇప్పటి వరకు 50 శాతం మందికి టీకా ఇచ్చినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 60 ఏళ్లపైబడిన వారిలో 80 శాతం మంది కనీసం ఒక్కడోసును తీసుకున్నారు.
గతేడాదిలో అమెరికాలో కరోనా విలయ తాండవం చేసింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ ఏడాది మహమ్మారిని అదుపు చేసే దిశగా బైడెన్ ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. వైరస్ వేరియంట్లు బలంగా ఉన్నందున వ్యాక్సినేషన్ ప్రక్రియను చురుగ్గా నిర్వహించాలని యోచించింది. ఆ దిశగా ఏర్పాట్లు పూర్తి చేసింది. అందుకే కేవలం వంద రోజుల్లో రెండు వందల మిలయన్ మందికి టీకాను ఇచ్చారు. ఈ విషయంలో బైడెన్ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేసిందని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి.