Begin typing your search above and press return to search.

తనకంటే మూడేళ్ల చిన్నోడిని పెళ్లి చేసుకున్న అమెరికా అధ్యక్షుడి మనవరాలు!

By:  Tupaki Desk   |   21 Nov 2022 6:30 AM GMT
తనకంటే మూడేళ్ల చిన్నోడిని పెళ్లి చేసుకున్న అమెరికా అధ్యక్షుడి మనవరాలు!
X
ప్రపంచంలోనే ఏకైక అగ్ర రాజ్యం.. అమెరికా. అన్ని దేశాలకు అమెరికా మాటే శిలాశాసనం. అలాంటి దేశానికి అధ్యక్షుడి మనవరాలి పెళ్లి అంటే ఏ రేంజులో ఉండాలి?.. అయితే చాలా సింపుల్‌గా, సాధారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన మనవరాలి పెళ్లి జరిపించేశారు. అందులో గత పదేళ్లలో వైట్‌ హౌస్‌ (అమెరికా అధ్యక్షుడి నివాసం)లో జరిగిన వివాహం ఇదే కావడం గమనార్హం. అందులోనూ ఒక అధ్యక్షుడి మనవరాలి పెళ్లి జరగడం వైట్‌హౌస్‌ చరిత్రలోని తొలిసారి.

ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో దేశ, విదేశీ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, సినీ తారలతో అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుందని అందరూ అనుకోగా జో బైడెన్‌ అందరికీ షాకిచ్చారు. కేవలం ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తులతో తన మనుమరాలి పెళ్లిని జరిపించారు.

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కుమారుడు  హంటర్‌ బైడెన్, ఆయన తొలి భార్య కాథ్లీన్‌ బూహ్లేల సంతానమే నయోమి బైడెన్‌. ఈ నేపథ్యంలో మనవరాలు నయోమీ బైడెన్‌ వివాహాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన నివాసం వైట్‌హౌస్‌లో ఘనంగా జరిపించారు.

ఇప్పటివరకు వైట్‌హౌస్‌లో జరిగిన 19వ వివాహం ఇది. నయోమి (28) కంటే పీటర్‌ నీల్‌ (25) మూడేళ్లు చిన్నవాడు కావడం గమనార్హం. కాగా నయోమీ బైడెన్‌ వాషింగ్టన్‌లో లాయర్‌గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా జో బైడెన్‌కు రాజకీయ సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు.

కాగా నయోమి బైడెన్, పీటర్‌ నీల్‌ది ప్రేమ వివాహం కాదని.. పెద్దలు కుదిర్చిన పెళ్లేనని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్‌ హౌస్‌లో జరిగిన నవోమీ బైడెన్, పీటర్‌ నీల్‌ వివాహానికి దేశాధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌ సహా దాదాపు 250 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు.

కనీసం ప్రచారం కోసం మీడియాను కూడా పెళ్లికి పిలవలేదు. ఈ పెళ్లికి అయిన ఖర్చును కూడా తన సొంత ఆదాయం నుంచే జో బైడెన్‌ ఖర్చు పెట్టడం గమనార్హం.

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జో బైడెన్‌ అట్టహాస కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ కార్యక్రమాలకు వినియోగించాల్సిన సొమ్మును ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.