Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై బైడెన్ అసహనం

By:  Tupaki Desk   |   2 Nov 2022 2:30 AM GMT
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై బైడెన్ అసహనం
X
అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పై అసహనం వ్యక్తంచేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్‌లో ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సహాయం గురించి చర్చించడానికి ఫోన్ కాల్ చేశాడు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ కోరికలపై జోబైడెన్ సహనం కోల్పోయాడు.

జూన్ 15న బిడెన్ 1 బిలియన్ డాలర్ల రక్షణ సాయం చేశారు. మానవతాదృక్పథంతో నిధులను దేశం కోసం అందించారు. అయితే ఇంత చేసినా కూడా జెలెన్స్‌కీ కి ఫోన్ చేయగా.. అతడు మరిన్ని నిధులు అడగడంతో జోబైడెన్ అసహనం వ్యక్తం చేశాడు.

బిడెన్ తన దేశానికి అవసరమైన మరిన్ని విషయాలను జాబితా చేసి అడిగినప్పుడు జెలెన్స్కీకి సమాచారం ఇవ్వడం పూర్తి కాలేదు. మరిన్ని నిధులు కావాలని అడగడంతో జో బిడెన్ తన స్వరాన్ని పెంచి అసహనం వ్యక్తం చేశాడు. జెలెన్ స్కీని ఉద్దేశించి "కొంచెం కృతజ్ఞత చూపగలరు " అంటూ బైడెన్ అసంతృప్తి తెలిపారు.

ఉక్రెయిన్‌కు అమెరికా కొత్త సహాయ ప్యాకేజీలను ప్రకటించిన ప్రతిసారీ జెలెన్ స్కీకి బిడన్ ఫోన్ చేసి వివరిస్తాడు.

ముఖ్యంగా ఫిబ్రవరి 24న రష్యా-ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి యుక్రెయిన్‌కు భద్రతా సహాయాన్ని అందించడంలో యునైటెడ్ స్టేట్స్ అగ్రగామిగా ఉంది.

అమెరికా 2022లో ఉక్రెయిన్‌కు మరింత అధునాతన రక్షణ పరికరాలను అందించింది. అలాగే గతంలో అందించిన పరికరాలలో ఎక్కువ మొత్తంలో ఇచ్చినా ఉక్రెయిన్ మరిన్ని అడగడంతో బైడెన్ కు చిర్రెత్తుకొచ్చింది.

ఉక్రెయిన్‌కు అమెరికా చేస్తున్న సాయంలో అత్యాధునిక ఆయుధాలున్నాయి. హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్, స్టింగర్ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్, జావెలిన్ యాంటీ ఆర్మర్ సిస్టమ్స్ మరియు ఎంఐ-17 హెలికాప్టర్లు ఉన్నాయి.

యుక్రేనియన్ అధికారులు మరిన్ని ఆయుధాలను అమెరికా నుంచి అడుగుతున్నారు. ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ షిప్, అదనపు ఎయిర్ డిఫెన్స్ , యాంటీ మిస్సైల్ సామర్థ్యాలతో సహా ఇతర అధునాతన వ్యవస్థలను పొందేందుకు ప్రయత్నించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.