Begin typing your search above and press return to search.
అమెరికా సర్కార్ లో మరో భారతీయ అమెరికన్ కు కీలక హోదా
By: Tupaki Desk | 17 April 2022 8:34 AM GMTఅమెరికాలోని ప్రముఖ సంస్థలను ఇండియన్లు ఏలుతున్నారు. ఉద్యోగ, వ్యాపార రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ భారతీయ ముద్ర వేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ నుంచి గూగుల్ సీఈవో వరకు మన పెత్తనమే నడుస్తోంది. తాజాగా మరో ప్రవాస భారతీయుడు అమెరికాలోని ప్రముఖ కంపెనీకి సీఈవో గా నియామకమయ్యారు. అమెరియా మల్టీ నేషనల్ కంపెనీ ఫెడెక్స్ కు రాజ్ సుబ్రమణియన్ సీఈవోగా ఇటీవల బాధ్యతలు చేపట్టారు.
అమెరికాలో జోబైడెన్ అధ్యక్షుడయ్యాక భారతీయులకు ఆయన ప్రభుత్వంలో పెద్దపీట దక్కుతోంది. ఇప్పటికే 20 మందికి పైగా భారత సంతతి వ్యక్తులను తన టీంలో జోబైడెన్ నియమించుకున్నారు. ఇటీవల మరో ఇద్దరు భారత సంతతి మహిళలను కీలక పదవుల్లో నియమించారు.
తాజాగా దౌత్యాధికారి రచనా సచ్ దేవ కొర్హొనెన్ ను మాలిలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఆమె స్వస్థలం న్యూజెర్సీలోని ఫ్లెమింగ్ టన్. నెల వ్యవధిలో భారతీయ మూలాలున్న పునీత్ తల్వార్ ను మొరాకో రాయబారిగా.. షెఫాలీ రజ్దాన్ దుగ్గల్ ను నెదర్లాండ్ ప్రతినిధిగా అధ్యక్షుడు జోబిడెన్ నియమించారని వైట్ హౌస్ ప్రకటించింది.
ఇక అంతుకుముందే.. మీరా జోషి అనే భారతీయ అమెరికన్ ను రవాణాశాఖలోని ఫెడరల్ మోటార్ క్యారియర్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ కు అడ్మినిస్ట్రేటర్ గా నామినేట్ చేశారు. ఇక మరో భారత సంతతి మహిళ రాధిక ఫాక్స్ ను పర్యావరణ పరిరక్షణ సంస్థ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ గా నామినేట్ చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన 2021 జనవరి 20 నాటి నుంచి ఈ ఇద్దరూ ఆయన అడ్మినిస్ట్రేషన్ లో పనిచేస్తున్నారు. వారికి తాజాగా ప్రమోషన్లు ఇచ్చి కీలక బాధ్యతలను జోబైడెన్ అప్పగించారు.