Begin typing your search above and press return to search.

ట్రంప్ మూసిన తలుపును తెరిచిన బైడెన్.. గ్రీన్ కార్డుకు గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   10 Sep 2022 10:30 AM GMT
ట్రంప్ మూసిన తలుపును తెరిచిన బైడెన్.. గ్రీన్ కార్డుకు గుడ్ న్యూస్
X
అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన కాలంలో ట్రంప్ విధానాల గురించి తెలిసిందే. విదేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడే వారి విషయంలో ట్రంప్ వైఖరి కఠినంగా ఉండేది. వీసా దగ్గర నుంచి గ్రీన్ కార్డు జారీ వరకు ప్రతి విషయంలోనూ అమెరికన్ల ప్రయోజనాల పేరుతో ఎంతో మంది కలల్ని ఆయన కల్లలు చేసిన వైనం తెలిసిందే.

ట్రంప్ అధికారం నుంచి దిగేసి.. ఆయన స్థానంలో బైడెన్ కొలువు తీరిన నేపథ్యంలో.. ట్రంప్ తలనొప్పి పంచాయితీలను పక్కన పెట్టేసి.. విదేశీయులకు మంచి జరిగేలా బైడెన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

తాజాగా అలాంటి నిర్నయాన్నే ఆయన తీసుకున్నారు. అమెరికాలో నివాసం ఉంటూ.. అల్పాదాయంతో బండి లాగించే వారికి గ్రీన్ కార్డు జారీ చేసే విషయంలో సవాలచ్చ ఆంక్షలు ట్రంప్ హయాంలో ఉండేవి. అలాంటి వాటిని పక్కన పెట్టేసి.. వీలైనంత మంది ముఖాల్లో చిరునవ్వులు చిందించేలా బైడెన్ నిర్ణయాలు ఉంటున్నాయి.

తాజాగా గ్రీన్ కార్డుజారీకి సంబంధించిన కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ట్రంప్ హయాంలో ప్రభుత్వ సబ్సిడీలు పొందే అల్పాదాయ వర్గాల విదేశీయులకు గ్రీన్ కార్డు ఇచ్చేందుకు నో చెప్పేవారు. దీనికి భిన్నంగా తాజాగా బైడెన్ సర్కారు మాత్రం.. అలాంటిదేమీ లేకుండా ప్రభుత్వ సబ్సిడీలు పొందే వారికి కూడా గ్రీన్ కార్డులు ఇచ్చేలా నిబంధనల్నిమారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా మార్చిన నిబంధనల్ని డిసెంబరు 23 నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం హోసింగ్ వోచర్లు.. ఫుడ్ స్టాంపులు.. మెడికల్ సాయం పొందిన వారికి గ్రీన్ కార్డులు జారీ చేసే వారు కాదు. వలసదారుల ఆదాయం.. వయసు.. ఆరోగ్య పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకునే వారు. తాజాగా మార్చిన నిబంధనల ప్రకారం మాత్రం ఇలాంటివేమీ పరిగణలోకి లేకుండానే గ్రీన్ కార్డు జారీ చేసేలా నియమావళిని మార్చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.