Begin typing your search above and press return to search.
బైడెన్ సంచలన నిర్ణయం.. పుతిన్ కు కోలుకోలేని దెబ్బ?
By: Tupaki Desk | 2 March 2022 3:30 PM GMTరష్యా-ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై బాంబుల వర్షం కురుస్తోంది. అయినా ఏమాత్రం వెనుకడుగువేయకుండా ఉక్రెయిన్ సైన్యం ధైర్యంగా ఎదుర్కొంటోంది. అయితే అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో... ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. యుద్ధాన్ని విరమింపజేసుకోవాలని సూచిస్తున్నాయి.
అంతేకాకుండా ఈ యుద్ధాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అయినా కూడా పుతిన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కాగా ఈ యుద్ధంపై అగ్రరాజ్యం అమెరికా భగ్గుమంది. ఉక్రెయిన్ అండగా ఉంటామని మాట ఇచ్చింది. అంతేకాకుండా రష్యాపై పలు ఆంక్షలు విధించింది. అమెరికా అధ్యక్షుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా రష్యాకు కోలుకోలేని దెబ్బగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు.
రష్యా దురాక్రమణపై జో బైడెన్ తీవ్రంగా స్పందించారు. తక్షణమే యుద్ధ విరమణ చేసుకోవాలని చెప్పినా... వెనక్కి తగ్గపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యుద్ధంలో పుతిన్ తాత్కాలికంగా లాభపడవచ్చుకానీ... దీర్ఘకాలంలో చాలా పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.
యుద్ధంలో గెలవవచ్చుకానీ... ఉక్రెయిన్ ల హృదయాల్లో ఎన్నటికీ స్థానం సంపాదించలేరని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అమెరికా గగనతలంలో రష్యన్ విమానాలను నిషేధించారు. రష్యా భారీ మూల్యం చెల్లించుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రష్యా ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేస్తామని బైడెన్ హెచ్చరించారు. తీవ్రమైన ఆంక్షలను విధిస్తామని అన్నారు. ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా అండగా ఉంటుందని హామీనిచ్చారు. ఉక్రెయిన్ కు కావాల్సిన ఆయుధ, మానవతా సాయం చేస్తామని భరోసానిచ్చారు. అయితే అమెరికా నేరుగా యుద్ధంలోకి జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు.
అమెరికా బలగాలు యుద్ధంలో పాల్గొనకూడదని తెలిపారు. కానీ పశ్చిమవైపు వస్తే మాత్రం రష్యాను బలంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. నాటో భూభాగళంలో అంగుళం కూడా వదులుకోము అని స్పష్టం చేశారు. పోలాండ్, రొమేనియా, లాట్వియా, లితువేనియా దేశాల్లో బలగాలను మోహరించామని వెల్లడించారు.
నాటో భూభాగంలో రష్యా దుస్సాహసానికి ఒడిగడితే... గట్టిగా తిప్పికొడతామని బైడెన్ హెచ్చరించారు. కాగా రష్యా దురాక్రమణను ఇప్పటికే చాలా దేశాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ఐరాస కూడా ఈ యుద్ధాన్ని విరమించి... చర్చలు జరుపుకోవాలని సూచించింది. అయినా కూడా యుద్ధం కొనసాగుతూనే ఉంది.
రాజధాని కీవ్ చుట్టూ రష్యన్ బలగాలు మోహరించాయి. మరోవైపు ఉక్రెయిన్ సైన్యం ఎదురొడ్డి నిలుస్తూ... యుద్ధాన్ని ఎదుర్కొంటున్నాయి. రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న యుద్ధం... ముందు ముందు ఎలా పరిణమిస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.