Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేక్ :మ‌ళ్లీవారే..! బొత్స‌కు..కొడాలికి బెర్త్ క‌న్ఫం !

By:  Tupaki Desk   |   9 April 2022 9:38 AM GMT
బిగ్ బ్రేక్ :మ‌ళ్లీవారే..! బొత్స‌కు..కొడాలికి బెర్త్ క‌న్ఫం !
X
ఆంధ్రావ‌నిలో మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌కు సంబంధించి కీల‌క స‌మాచారం అందింది. అనూహ్య రీతిలో సీన్ లోకి మ‌ళ్లీ సీనియ‌ర్ లీడ‌ర్ బొత్స స‌త్య‌నారాయ‌ణ, కొడాలి నాని వ‌చ్చారు. వీరికి బెర్తుల‌ను క‌న్ఫం చేస్తున్నార‌ని తెలుస్తోంది. వీరితో పాటు మ‌రికొన్ని పాత ముఖాల‌కు కూడా మ‌రోసారి అవకాశం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి నిర్ణ‌యించార‌ని స‌మాచారం.

ఈ లెక్కన చూసుకుంటే తొలుత జ‌గ‌న్ కొత్త క్యాబినెట్లో తిరిగి కొన‌సాగుతారు అనుకున్న ఐదుగురు కాస్త ఇప్పుడు పెరిగారు. ఇక కొత్త‌గా ప‌ద‌వులు అందుకునే వారి సంఖ్య 15కు చేరుకుంది. ఈ క్ర‌మంలో ముందునుంచీ ఊహించిన విధంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ కు ఛాన్స్ ఇచ్చార‌ని తెలుస్తోంది. ఎప్ప‌టి నుంచో ఆయ‌న న‌డ‌వ‌డి, ప‌నితీరుపై సంతృప్తిగా ఉన్నారు.

సామాజిక స‌మీక‌ర‌ణాలు కూడా ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చాయ‌న్న‌ది ఓ ప్రాథ‌మిక స‌మాచారం. అదేవిధంగా తానేటి వ‌నిత (స్త్రీ శిశు సంక్షేమ శాఖ) ను కూడా కంటిన్యూ చేయ‌నున్నారు. ఈమె పేరు మొద‌ట్లో వినిపించ లేదు. కానీ ఆఖ‌రి నిమిషంలో ఈమె పేరు జాబితాలో వ‌చ్చి చేరింది.దీంతో కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఆమెకు సముచిత ప్రాధాన్యం ద‌క్కిందని అంటున్నారు. నిన్న‌టి దాకా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా రాజ‌మ‌హేంద్రవ‌రం జిల్లాలో క‌లిపారు. కొత్త జిల్లాల‌ను అనుస‌రించి ఆమెకు ప‌ద‌వి వ‌రించింద‌ని భావింప‌వ‌చ్చు.

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన చెల్లుబోయిన వేణు (బీసీ సంక్షేమ శాఖ మంత్రి) కు కూడా క్యాబినెట్ లో బెర్త్ క‌న్ఫం అయింది. ఈయ‌నను సామాజిక వ‌ర్గ స‌మీక‌ర‌ణాల్లో భాగంగానే కొన‌సాగిస్తార‌న్న ఊహ‌లు నిజం అయ్యాయి. రోడ్లు,భ‌వ‌నాల శాఖ మంత్రి శంక‌ర్ నారాయ‌ణ‌ను, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం ను కూడా కొనసాగించే అవకాశాలు పుష్క‌లంగా ఉన్నాయి అని స‌చివాల‌య వ‌ర్గాలు వెల్ల‌డి చేస్తున్నాయి. జ‌య‌రాం పేరు ఊహించిందే అయినా అనూహ్య రీతిలో శంక‌ర్ నారాయ‌ణ పేరు తెర‌పైకి వ‌చ్చి జాబితాలో చోటు ద‌క్కించుకోవ‌డం ఓ విధంగా ఈ సీన్ కు హైలెట్.

కాసేప‌ట్లో కోర్ క‌మిటీతో సీఎం భేటీ కానున్నారు. మంత్రి వ‌ర్గంకు సంబంధించిన జాబితాను ఫైన‌ల్ చేయ‌నున్నారు. ఈ సాయంత్రానికి పాత, కొత్త మంత్రులు ఎవ‌ర‌న్న‌ది తేలిపోనుంది. ఇప్ప‌టిదాకా ఉన్న స‌మాచారం అనుస‌రించి చూస్తే.. 15 మంది ఎమ్మెల్యేల‌కు కొత్త‌గా క్యాబినెట్ లో చోటు దక్క‌నుంది అని తెలుస్తోంది.

మ‌త్స్య‌శాఖ మంత్రి సీదిరి అప్ప‌ల్రాజును కూడా సామాజిక వ‌ర్గ స‌మీక‌ర‌ణాల్లో భాగంగానే కంటిన్యూ చేస్తారు.ఆయ‌న ప‌ద‌వి పొంది ఏడాది కాలం మాత్ర‌మే పూర్త‌యినందున ముఖ్యమంత్రి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు అన్న‌ది వైసీపీ వ‌ర్గీయుల మాట.