Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్ః తెలంగాణ‌లో విద్యాసంస్థ‌ల మూసివేత‌!

By:  Tupaki Desk   |   23 March 2021 12:06 PM GMT
బిగ్ బ్రేకింగ్ః తెలంగాణ‌లో విద్యాసంస్థ‌ల మూసివేత‌!
X
క‌రోనా సెకండ్ విజృంభించే సూచ‌న‌లు క‌నిపిస్తుండ‌డంతో తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు అప్ర‌త్త‌మైంది. రాష్ట్రంలోని ప‌లు హాస్ట‌ళ్లు, విద్యాసంస్థల్లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతుండడంతో విద్యాసంస్థ‌ల‌న్నింటినీ మూసేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

ఈ మేర‌కు అసెంబ్లీలో విద్యాశాఖ‌ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ప్ర‌క‌ట‌న చేశారు. వైద్య విద్యాసంస్థ‌లు మిన‌హా.. అన్ని విద్యాసంస్థ‌ల‌నూ బంద్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. గురుకులాల‌తోపాటు హాస్ట‌ళ్లు కూడా మూత‌ప‌డ‌తాయ‌ని ప్ర‌క‌టించారు మంత్రి. మ‌ళ్లీ ఆన్ లైన్ లోనే విద్యాబోధ‌న కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

విద్యాసంస్థ‌ల్లో కొన్ని రోజులుగా క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో.. స్కూళ్ల మూసివేత‌పై ప్ర‌భుత్వం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతూ వ‌చ్చింది. ఇప్ప‌టికే.. విద్యాసంస్థ‌లు మూసేయాల‌ని వైద్య శాఖ కూడా సిఫార‌సు చేసింది. దీనిపై చ‌ర్చించిన త‌ర్వాత అన్ని విద్యాసంస్థ‌ల‌నూ క్లోజ్ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు మంత్రి తెలిపారు. ఇవాళ మ‌ధ్యాహ్నం ఈ విష‌య‌మై ముఖ్య‌మంత్రి చ‌ర్చించిన త‌ర్వాత‌.. ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

కాగా.. రాష్ట్రంలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇటీవలే సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్ పల్లి ఎస్సీఎస్టీ హాస్ట‌ల్ లో 40 మంది విద్యార్థుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. మ‌రో ఐదుగురు సిబ్బంది కూడా క‌రోనా బారిన ప‌డ్డారు., హ‌య‌త్ న‌గ‌ర్‌లోని పాఠ‌శాల‌తోపాటు కాలేజీలో చ‌దువుతున్న విద్యార్థుల్లో 30 మందికి కొవిడ్ సోకింది. ఇంకా..‌ ప‌లు మండ‌లాల్లోని హాస్ట‌ళ్ల‌లోనూ పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో.. ప్ర‌భుత్వం మూసివేత నిర్ణ‌యం తీసుకుంది.